Begin typing your search above and press return to search.

అలాంటి వాటిని పట్టించుకోనంటున్న మిల్కీ బ్యూటీ..!

తెలుగులో తనకు తగిన పాత్రలు చేస్తూ వస్తున్న తమన్నా హిందీలో ఈమధ్య వెబ్ సీరీస్ లతో రెచ్చిపోతుంది.

By:  Tupaki Desk   |   1 March 2024 10:05 AM GMT
అలాంటి వాటిని పట్టించుకోనంటున్న మిల్కీ బ్యూటీ..!
X

రెండు దశాబ్దాలకు పైగా సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగించిన హీరోయిన్స్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా హ్యాపీడేస్ తో హిట్ అందుకుని అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో అదరగొట్టారు. అప్పుడప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ అక్కడ ఆడియన్స్ ని అలరించింది తమన్నా. తెలుగులో తనకు తగిన పాత్రలు చేస్తూ వస్తున్న తమన్నా హిందీలో ఈమధ్య వెబ్ సీరీస్ లతో రెచ్చిపోతుంది.

కెరీర్ మొదలు పెట్టి 20 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ తమన్నా తన ఫాం కొనసాగిస్తుంది. ఇక అమ్మడు రీసెంట్ ఇంటర్వ్యూలో తనపై సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై స్పందించింది. సెలబ్రిటీల విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరికి వారు తమ అభిప్రాయాలు చెబుతుంటారు. మా జీవితంలో ఏం జరుగుతుందో కూడా వీళ్లు చెబుతుంటారు. అయితే అలాంటి వాటిపై అసలు తాను దృష్టి పెట్టనని అంటుంది తమన్నా. అలాంటి వార్తలను విషయాలను ఆలోచించడం మొదలు పెడితే వాటిని మనమే ప్రోత్సహించినట్టు అవుతుంది.. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే ఏం చేయాలనే దృష్టి పెడతాను తప్ప అలాంటి విషయాలను పట్టించుకోనని అంటుంది తమన్నా.

తన దృష్టిలో టాలీవుడ్, బాలీవుడ్ రెండు సమానమే అంటున్న మిల్కీ బ్యూటీ ముంబై లో పుట్టి పెరిగిన తనకు సినీ జీవిత దక్షిణాది సినిమాలతో మొదలైంది. అందుకే రెండు ప్రాంతాలను సొంత ఇల్లుగా భావిస్తానని అంటుంది. కళాకారులకు భాషా, ప్రాంతంతో సంబంధం లేదు. అక్కడకు ఇక్కడకు ప్రయాణం చేస్తూనే ఉండాలి. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే తమ పని అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ఈ ఇంటర్వ్యూలోనే దక్షిణాది సినీ పరిశ్రమ ఇంటర్నేషనల్ లెవెల్ లో మాట్లాడుకునేలా చేయడం మంచి విషయమని తమన్నా చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన జైలర్ సినిమాలో తమన్నా కావాలి సాంగ్ చేసింది. ఆ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా ఒక ఏనుగు కూడా ఆ పాటకు కాలు కదిపింది. ఆ వీడియో వైరల్ కాగా అది మనుషులతో చేసిన ఏనుగు కాబట్టి జనాలను ఆకర్షించేందుకు అలా స్టెప్పులు వేసినట్టు తెలుస్తుంది.