Begin typing your search above and press return to search.

తగ్గేదే లే... మిల్కీ బ్యూటీ బికినీ షో

తాజాగా బికినీతో మిల్కీ బ్యూటీ సర్‌ ప్రైజ్ చేసింది. ఒక ప్రముఖ బ్రాండ్ ప్రమోషన్ కోసం తమన్నా బికినీ ధరించింది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   6 Oct 2023 6:34 AM GMT
తగ్గేదే లే... మిల్కీ బ్యూటీ బికినీ షో
X

మిల్కీబ్యూటీ తమన్నా కెరీర్‌ ఆరంభించి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతోంది. అయినా కూడా ఇప్పటికి ఏదో ఒక ప్రాజెక్ట్‌ తో బిజీగానే ఉంటోంది. సినిమాలు.. సిరీస్ లు.. ఐటెం సాంగ్స్.. చివరికి వీడియో ఆల్బం ల్లో కూడా తమన్నా కనిపిస్తూ తన అభిమానులకు కన్నుల విందు చేస్తుంది. స్కిన్‌ షో విషయం లో మిల్కీ బ్యూటీ అస్సలు తగ్గడం లేదు.


తాజాగా మరోసారి తగ్గేదే లే అన్నట్లుగా తన అందాల ఆరబోత చేసింది. జైలర్ సినిమా తో పాటు ఇటీవల లస్ట్‌ స్టోరీస్ 2 లో కూడా మిల్కీ బ్యూటీ తమన్నా సంచలన అందాలను షో చేసింది. ఆ అందాల ఆరబోతకు ఫ్యాన్స్ తో పాటు అంతా కూడా షాక్ అయ్యారు. వయసు పెరుగుతున్నా కొద్ది మిల్కీ బ్యూటీ అందం పెరుగుతుందనే టాక్‌ వచ్చింది.

తాజాగా బికినీతో మిల్కీ బ్యూటీ సర్‌ ప్రైజ్ చేసింది. ఒక ప్రముఖ బ్రాండ్ ప్రమోషన్ కోసం తమన్నా బికినీ ధరించింది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సినిమాల్లో గతంలో పలు సార్లు బికినీతో సర్ ప్రైజ్‌ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి బికినీ అందాలతో కన్నుల విందు చేసింది.

టూ పీస్ బికినీ లో మిల్కీ బ్యూటీ ఇంకా కూడా తన అందం ఏమాత్రం తగ్గలేదు.. నేను యంగ్‌ హీరోలకు జోడీగా సినిమాలు చేయగల సత్తా ఉన్న నటిని అన్నట్లుగా ధీమాతో చెప్పకనే చెప్పింది. మొత్తానికి మిల్కీ బ్యూటీ బికినీ షో తో మరో అయిదు పది సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.