Begin typing your search above and press return to search.

తమన్నా.. పింక్ లో అల్ట్రా స్టైలిష్

రీసెంట్ గా స్టైలిష్ పింక్ డ్రెస్సులో కనిపించిన విధానం కుర్రాళ్ళ మనసును దోచేస్తుందే. గతంలో కూడా బ్యూటీ బికినీలలో కూడా కనిపించింది.

By:  Tupaki Desk   |   20 Nov 2023 2:29 PM GMT
తమన్నా.. పింక్ లో అల్ట్రా స్టైలిష్
X

మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న తమన్నా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో గ్లామర్ తోనే ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ బ్యూటీ ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా ఆ ఫోటోలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. 2005 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ బ్యూటీ ఫెయిల్యూర్స్ సక్సెస్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటుంది.

ఇక ఇటీవల కాలంలో అయితే ఆమెకు పెద్దగా విజయాలు దక్కలేదు. అయినప్పటికీ కూడా సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఒక విధంగా గ్లామర్ తోనే తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తోంది. కేవలం నటిగానే కాకుండా స్పెషల్ సాంగ్స్ తో కూడా ఆకట్టుకుంటోంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే విధంగా ఫోటోషూట్స్ కు వదులుతూ ఉంటుంది.

రీసెంట్ గా స్టైలిష్ పింక్ డ్రెస్సులో కనిపించిన విధానం కుర్రాళ్ళ మనసును దోచేస్తుందే. గతంలో కూడా బ్యూటీ బికినీలలో కూడా కనిపించింది. కానీ ఈ స్టైలిష్ డ్రెస్సులో మాత్రం చాలా అందంగా ఉంది అంటూ అబ్బాయిలు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. గ్లామర్ తో ఆకట్టుకోవడంలో ఆమె స్టైలే వేరు అని మరోసారి నిరూపించింది. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే సక్సెస్ చూసే చాలా కాలం అయింది.

ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ అనే సినిమా చేసింది. ఆ సినిమా దారుణంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో మాత్రం హీటెక్కించే పాత్రతో అందరికీ ఆ అస్సీకార్యాన్ని కలిగించింది. రొమాంటిక్ సన్నివేశాలలో కూడా తమన్నా స్టన్నింగ్ గ్లామర్ తో షాక్ ఇచ్చింది.

ఇక జైలర్ సినిమాలో కూడా కనిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అందులో కావాలయ్యా పాటతోనే మంచి క్రేజ్ అందుకుంది. రీసెంట్ గా మలయాళం లో బంద్ర అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం తమిళంలో అరన్మనై 4 సినిమా చేస్తోంది. అలాగే హిందీలో కూడా ఓ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అయితే తమన్నాకు కి పెద్దగా అవకాశాలు లేవు. మరి తన గ్లామర్ తో అమ్మడు రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.