Begin typing your search above and press return to search.

సర్‌ప్రైజ్‌ కి రెడీ అయిన ముద్దుగుమ్మలు..!

టాలీవుడ్‌ ముద్దుగుమ్మలు తమన్నా భాటియా మరియు రాశి ఖన్నాలు ఈ మధ్య కాలంలో తెలుగు స్క్రీన్‌ పై ఎక్కువగా కనిపించడం లేదు

By:  Tupaki Desk   |   11 April 2024 7:06 AM GMT
సర్‌ప్రైజ్‌ కి రెడీ అయిన ముద్దుగుమ్మలు..!
X

టాలీవుడ్‌ ముద్దుగుమ్మలు తమన్నా భాటియా మరియు రాశి ఖన్నాలు ఈ మధ్య కాలంలో తెలుగు స్క్రీన్‌ పై ఎక్కువగా కనిపించడం లేదు. వీరు తమిళంలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నారు. తాజాగా వీరిద్దరు హీరోయిన్స్‌ గా తమిళంలో 'అరణ్మణి 4' అనే సినిమా రూపొందింది.

హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న సుందర్‌ సి దర్శకత్వంలో రూపొందిన హరర్‌ కామెడీ సిరీస్‌ అరణ్మణి 4 లో శివాని గా తమన్నా, మాయ పాత్రలో రాశి ఖన్నా నటించారు. తెలుగు లో వీరిద్దరికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

అరణ్మణి 4 ను తెలుగు లో 'బాక్‌' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. బాక్ సినిమా లో తమన్నా మరియు రాశి ఖన్నా లుక్‌ లను తాజాగా రివీల్‌ చేశారు. పోస్టర్స్ ను చూస్తూ ఉంటే కచ్చితంగా ముద్దుగుమ్మలు ఇద్దరు కూడా బాక్‌ సినిమాతో సర్‌ప్రైజ్‌ చేసేలా ఉన్నారంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ఇప్పటి వరకు అందాల ఆరబోత పాత్రలతో మెప్పించారు. అయితే ఈ బాక్ లో మాత్రం దెయ్యం పాత్రలో కనిపించి సర్‌ ప్రైజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడం వల్ల సినిమా స్థాయి మరింత పెరిగింది.

ఈ సినిమా మరో విశేషం ఏంటంటే సుందర్‌ సి హీరోగా నటించాడు. ఆయన గతంలో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లు ఈ సినిమాలో ఆయన కనిపించబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ నమ్మకంగా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో ఈ సినిమా ఏ మేరకు సక్సెస్‌ అయ్యేను చూడాలి.