Begin typing your search above and press return to search.

ఓదెలా 2 స్టన్నింగ్ లుక్.. తమన్నా 'శివశక్తి'

రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   8 March 2024 5:08 AM GMT
ఓదెలా 2 స్టన్నింగ్ లుక్..  తమన్నా శివశక్తి
X

రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పుడు ఈ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ ఓదెల-2లో నటిస్తోంది. ఇటీవల వారణాసిలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. డిఫరెంట్ రోల్ పోషిస్తున్న తమన్నా లీక్డ్ పిక్స్ చూసి సినీ లవర్స్ అంతా ఒక్కసారిగా షాకయ్యారు.

అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌ వర్క్స్ బ్యానర్లపై డి మధు నిర్మిస్తున్నారు. హీరోయిన్ హెబ్బా పటేల్ మరో లీడ్ రోల్ పోషిస్తోంది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓదెల-2లో పాత్ర కోసం తమన్నా తన మేక్ఓవర్ ను పూర్తిగా మార్చుకుంది. దిట్టమైన జుట్టుతో నాగ సాధువులా కనిపిస్తోంది. ఒక చేతిలో పవిత్ర కర్ర, మరో చేతిలో ఢమరుకం పట్టుకుని శివశక్తిలా దర్శనమిస్తోంది. కాశీ ఘాట్ లపై నడుస్తూ.. దేవుడిని ప్రార్థిస్తూ కనిపిస్తోంది. తమన్నా పోస్టర్ ను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఏ పాత్రలోనైనా తమన్నా జీవించేస్తుందని కామెంట్లు పెడుతున్నారు. మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్ అంటూ చెబుతున్నారు.

సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన ఊరిని దుష్ట శక్తుల నుంచి ఎలా రక్షిస్తారనేది ఓదెల్-2 మూవీ మెయిన్ కాన్సెప్ట్ గా తెలుస్తోంది. ఓదెల రైల్వేస్టేషన్ లో లీడ్ రోల్ పోషించిన హెబ్బా పటేల్.. సీక్వెల్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. వశిష్ట సింహా లీడ్ రోల్ పోషిస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

2023లో లస్ట్ స్టోరీస్, జీ కర్దాలాంటి వెబ్ సిరీస్ లతోపాటు తమిళంలో జైలర్, తెలుగులో భోళా శంకర్ సినిమాల్లో తమన్నా నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓదెల-2తోపాటు మరో రెండు సీక్వెల్స్ ఉన్నాయి. కోలీవుడ్ లో సుందర్ సి దర్శకత్వంలో అరణ్మణై 4, బాలీవుడ్ లో స్త్రీ 2 చేస్తోంది. మరి తమన్నా వరుస చిత్రాలు ఎలా అలరిస్తాయో చూడాలి.