Begin typing your search above and press return to search.

త‌మ‌న్నా అందుకే విన్-టేజ్ గ‌ర్ల్

కొన్ని ఫోటోల్లో మిల్కీ బ్యూటీ బ్యాక్ లెస్ గా క‌నిపించ‌గా, మ‌రికొన్నిటిలో అల్ట్రా స్టైలిష్ డిజైన‌ర్ లుక్ లో క‌నిపించింది.

By:  Tupaki Desk   |   20 Oct 2023 8:43 AM GMT
త‌మ‌న్నా అందుకే విన్-టేజ్ గ‌ర్ల్
X

మిల్కీవైట్ బ్యూటీ త‌మ‌న్నా భాటియా ఏం చేసినా ప్ర‌త్యేకంగా ఉంటుంది. బాహుబ‌లి అవంతిక‌గా ప్ర‌జ‌ల మ‌న‌సులు దోచిన త‌మ‌న్నా ఆ త‌ర్వాత చాలా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టించింది. ఇటీవ‌ల సౌతిండియా అగ్ర‌హీరోలు చిరంజీవి, ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌నా వ‌రుస అవ‌కాశాలు అందుకుంది. ర‌జ‌నీ 'జైల‌ర్' సినిమాతో త‌మ‌న్నా 500 కోట్ల క్ల‌బ్ నాయిక అయింది. కెరీర్ బండి విజ‌య‌వంతంగా న‌డిపిస్తూనే మ‌రోవైపు ప్రియుడు విజ‌య్ వ‌ర్మ‌తో త‌మ‌న్నా ఔటింగులకు వెళ్ల‌డం యువ‌త‌రంలో చ‌ర్చగా మారింది.


అటు సోష‌ల్ మీడియాల్లోను ఈ బ్యూటీ స్పీడ్ మీద ఉంది. ఇంత‌లోనే త‌మ‌న్నా భాటియా వేడెక్కించే ఫోటోషూట్ తో సంచ‌ల‌నంగా మారింది. పాపుల‌ర్ ఫ‌ల్గుని షేన్ 'పీకాక్ ఇండియా' మ్యాగ‌జైన్ క‌వ‌ర్ షూట్ లో పాల్గొన్న త‌మ‌న్నా సోష‌ల్ మీడియాల్లో కొన్ని హాటెస్ట్ ఫోటోల‌ను షేర్ చేసింది. దీనికి మిల్కీ ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ని ఇచ్చింది. ''@falgunishanepeacockindia మళ్లీ అద్భుతాలు చేసింది! ఈ అద్భుతమైన ఆర్కైవల్ పీస్‌కు ధన్యవాదాలు! మీతో చాందిని తో కలిసి దీన్ని చేయడం చాలా ఇష్టం.. అని త‌మ‌న్నా ఇన్ స్టాలో పేర్కొంది.


త‌మ‌న్నా డిఫ‌రెంట్ లుక్స్ కి సంబంధించిన ఈ ఫోటోషూట్ యువ‌త‌రాన్ని వేడెక్కిస్తోంది. కొన్ని ఫోటోల్లో మిల్కీ బ్యూటీ బ్యాక్ లెస్ గా క‌నిపించ‌గా, మ‌రికొన్నిటిలో అల్ట్రా స్టైలిష్ డిజైన‌ర్ లుక్ లో క‌నిపించింది. ప్ర‌తిదీ యూనిక్ అనిపించే ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు అంత‌ర్జాలాన్ని చుట్టుముడుతున్నాయి.

త‌మ‌న్నా గ్లామ‌ర్ ఏమాత్రం త‌గ్గ‌లేదంటూ యువ‌త‌రం హాట్ కామెంట్లు పెడుతున్నారు. ఒక అభిమాని ఇది ఈజిప్ట్ టోంబ్ నుంచి బ‌య‌ట‌ప‌డిన ఈజిప్షియ‌న్ రాకుమారి రూపం అంటూ కితాబిచ్చేస్తున్నారు. మొత్తానికి త‌మ‌న్నా బోల్డ్ ఫోటోషూట్ వ‌ర్క‌వుటైంది. యూత్ కి గిలిగింత‌లు పెట్ట‌డంలో త‌మ్మూ ఎప్పుడూ ముందుంద‌ని ప్రూవైంది.

తమన్నా భాటియా -విజయ్ వర్మ జంట ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. ఈ జంట ఇటీవ‌ల ఓటీటీ సిరీస్ తో అల‌రించారు. ఇక‌పై పెద్ద తెర‌పైనా క‌లిసి న‌టించాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు. ఈలోగా, తమ్మన్నా భాటియా హార్రర్ డ్రామా అర‌ణ్మ‌నై 4లో కనిపించనుంది. దర్శకుడు నిక్కిల్ అద్వానీ 'వేదా'లో కూడా కనిపిస్తుంది. తన తదుపరి చిత్రంలో జాన్ అబ్రహంతో స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేస్కోనుంది.