Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో మిల్కీబ్యూటీ ప‌రిస్థితి ఏంటి?

మ‌రి తాజాగా టాలీవుడ్ లో త‌మ‌న్నా ప‌రిస్థితి ఏంటి? ఆమె ఎన్ని సినిమాలు చేస్తుంది? అంటే చేతిలో తెలుగు అవ‌కాశాలేవి లేన‌ట్లే క‌నిపిస్తుంది

By:  Tupaki Desk   |   15 Nov 2023 4:30 PM GMT
టాలీవుడ్ లో మిల్కీబ్యూటీ ప‌రిస్థితి ఏంటి?
X

మిల్కీబ్యూటీ టాలీవుడ్ లో ఏ రేంజ్ లో చ‌క్రం తిప్పిందో చెప్పాల్సిన ప‌నిలేదు. సీనియ‌ర్ హీరోల నుంచి ఆ త‌ర్వాత త‌రం న‌టులు.... యంగ్ హీరోల వ‌ర‌కూ అంద‌రితో తెర‌ను పంచుకుంది. 15 ఏళ్ల పాటు ప‌రిశ్ర‌మ‌లో తిరుగులేని నాయిక‌గా కొన‌సాగింది. ఇదే క్ర‌మంలో ఇత‌ర భాష‌ల్లోనూ సినిమాలు చేసింది. అటుపై అవ‌కా శాలు త‌గ్గ‌డంతో ఐటం భామ‌గానూ మారింది. బ‌డ్జెట్ సినిమాల్లో సైతం నాయిక‌గా న‌టించింది.

మ‌రి తాజాగా టాలీవుడ్ లో త‌మ‌న్నా ప‌రిస్థితి ఏంటి? ఆమె ఎన్ని సినిమాలు చేస్తుంది? అంటే చేతిలో తెలుగు అవ‌కాశాలేవి లేన‌ట్లే క‌నిపిస్తుంది. గ‌డిచిన మూడేళ్ల‌లో త‌మ‌న్నా కేవ‌లం రెండు..మూడు తెలుగు సినిమాలే చేసింది. 'ఎఫ్ -3' త‌ర్వాత 'గుర్తుందా శీతాకాలం'..'భోళా శంక‌ర్' చిత్రాల్లోనే న‌టించింది. హిందీ..త‌మిళ్ లో మాత్రం కొన్ని సినిమాలు చేసింది. మొత్తంగా 2022-23 లో త‌మ‌న్నా మార్క్ ఏం క‌నిపించ‌లేద‌నే చెప్పాలి.

ఇక త‌మ‌న్నా రూపంలో సైతం చాలా మార్పులొచ్చాయి. కొన్ని ర‌కాల విమర్శ‌లు కూడా తెర‌పైకి వ‌స్తు న్నాయి. అలాగే విజ‌య్ వ‌ర్మ‌తో డేటింగ్ లోనూ ఉంది. వివాహ బంధంతో ఓ ఇంటిది కాబోతుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఇలాంటి త‌రుణంలో త‌మ‌న్నా మ‌ళ్లీ తెలుగు సినిమాల్లో బౌన్స్ బ్యాక్ కాగ‌ల‌దా? అంటే అంత వీజీ కాద‌నే తెలుస్తోంది. త‌మ‌న్నా ఇప్పుడా ఛ‌రిష్మాని కోల్పోయింద‌నే విమ‌ర్శ వినిపిస్తుంది.

కొత్త భామ‌ల నుంచి పోటీని త‌ట్టుకునేందుకు ఇన్ స్టా వేదిక‌గా ర‌క‌ర‌కాల జిమ్ములు ప్లే చేస్తున్నా! అవేవి మార్కెట్ లో వ‌ర్కౌట్ అవ్వ‌డం లేదు. త‌మ‌న్నా బ్యూటీని ఒక‌ప్పుడు ఎంత‌గా ఆకాశానికి ఎత్తేసారో? ఇప్పుడ‌దే స్థాయిలో విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నాయి. సీనియ‌ర్ నాయిక‌ల్లో కొంత మంది త‌ప్ప అంద‌రూ బౌన్స్ బ్యాక్ కావ‌డం క‌ష్ట‌మ‌ని నిపుణులు భావిస్తున్నారు. మ‌రి త‌మ‌న్నా ఆ ఎనాల‌సిస్ ని బ్రేక్ చేసి బౌన్స్ బ్యాక్ అవుతుందా? అన్న‌ది చూడాలి.