Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: త‌మ‌న్నా ముఖ మైకం

మిల్కీవైట్ బ్యూటీ త‌మ‌న్నా గ‌త కొంత‌కాలంగా స్థ‌బ్ధుగా ఉంది. ఈ నిశ్శ‌బ్ధం తుఫాన్ ముందు నిశీధి లాంటిది

By:  Tupaki Desk   |   3 April 2024 2:25 PM GMT
ఫోటో స్టోరి: త‌మ‌న్నా ముఖ మైకం
X

మిల్కీవైట్ బ్యూటీ త‌మ‌న్నా గ‌త కొంత‌కాలంగా స్థ‌బ్ధుగా ఉంది. ఈ నిశ్శ‌బ్ధం తుఫాన్ ముందు నిశీధి లాంటిది. త‌మ‌న్నా త‌దుప‌రి వ‌రుస‌గా తాను న‌టిస్తున్న సినిమాల రిలీజ్ ప్ర‌మోష‌న్స్ లో బిజీ కానుంది. ఈలోగానే త‌న అభిమానుల‌ను యంగేజ్ చేసేందుకు వ‌రుస ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. ఇందులో భాగంగానే తాజాగా కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కవర్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వ‌చ్చింది.

నిజానికి ఈ ఫోటోషూట్ పూర్తిగా క్రియేటివిటీతో కూడుకున్న‌ది. మిల్కీ లోని ఇత‌ర గ్లామ‌ర‌స్ కోణాన్ని విడిచిపెట్టి పూర్తిగా ముఖాభిన‌యంపై ఫోక‌స్ చేసిన ఫోటోషూట్ ఇది. మిల్కీ వైట్ బ్యూటీ అంద‌మైన ముఖార‌విందాన్ని అభిమానులు ప‌దే ప‌దే ప‌రిశీలించే విధంగా ఈ ఫోటోషూట్ చేశార‌ని చెప్పాలి. ప‌సుపు రంగు స్వెట్ ష‌ర్ట్ ధ‌రంచిన త‌మ‌న్నా.. అంద‌మైన ముఖాకృతి.. ఆ ముఖంలో తీక్ష‌ణ‌మైన కంటి చూపు.. డార్క్ స్పాట్స్ (పుట్టుమ‌చ్చ‌లు).. పింక్ లిప్స్ ప్ర‌ధాన హైలైట్స్ గా హృద‌యాల‌ను ట‌చ్ చేస్తున్నాయి. ఈ అంద‌మైన ముఖానికి మ్యాట్ ఫౌండేషన్, పింక్ ఐలైనర్ .. పింక్ లిప్‌స్టిక్ .. కంటికి పర్పుల్ మాస్కరా..అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌ను పెంచాయ‌న‌డంలో సందేహం లేదు. ది గ్రేట్ ఆర్జీవీ ప‌రిభాష‌లో చెప్పాలంటే ఇది ముఖ‌మైకం అనే ఫోటోషూట్ కి సంబంధించిన‌ది. అందుకే ఇంత‌గా ఆక‌ర్షిస్తోంది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

త‌మ‌న్నా త‌మిళంలో 'ఆర‌ణ్మ‌నై 4'లో న‌టిస్తోంది.. బాలీవుడ్ లో జాన్ అబ్ర‌హాం స‌ర‌స‌న 'వేద' చిత్రంలో న‌టిస్తోంది. స్పెష‌ల్ ఓపిఎస్ ఫేం నీర‌జ్ పాండే ద‌ర్శ‌క‌త్వంలో కూడా ఒక మూవీ చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే చిత్రీక‌ర‌ణ‌ ప్రారంభమైంది. ఈ సంవత్సరం చివరిలో విడుదలవుతుంది. ఇది థియేటర్లలో విడుదల కాదు .. పాపుల‌ర్ OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రదర్శిత‌మ‌వుతుంది. నిజానికి సెట్స్‌లో జామర్‌లు ఉన్నాయి.. దాని వ‌ల‌న‌ లోపల ఎవరూ ఏమీ షూట్ చేయలేరు లేదా కమ్యూనికేట్ చేయలేరు. ఇత‌ర ప్రాజెక్టులు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయ‌ని తెలిసింది. మ‌రోవైపు తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోనే అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తోంద‌ని స‌మాచారం.