Begin typing your search above and press return to search.

వీడియో : కొత్త పార్లమెంట్ లో మిల్కీ బ్యూటీ

కొత్త పార్లమెంట్‌ భవనం లో తమన్నా కొంత సమయం సందడి చేశారు. చీర కట్టు లో తమన్నా ను పార్లమెంట్‌ లో చూడటం జరిగింది.

By:  Tupaki Desk   |   21 Sep 2023 11:08 AM GMT
వీడియో : కొత్త పార్లమెంట్ లో మిల్కీ బ్యూటీ
X

ఇటీవలే ప్రారంభం అయిన కొత్త పార్లమెంట్ భవన సముదాయాన్ని బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ సందర్శిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్‌ షెహనాజ్‌ గిల్ ఇంకా భూమి పెడ్నేకర్ లు ఇటీవల కొత్త పార్లమెంట్‌ భవనం ను సందర్శించి తమ ఆనందం ను పంచుకున్నారు.

ఆ తర్వాత క్రికెటర్ మిథాలి రాజ్ ఇంకా మేరీకోమ్‌, రాణి రామ్ పాల్, దీపా మెహతా లు కూడా కొత్త పార్లమెంట్ భవనంను సందర్శించారు. ఇప్పుడు ఆ జాబితాలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ మిల్కీ బ్యూటీ తమన్నా జాయిన్ అయింది. కొత్త పార్లమెంట్‌ భవనం లో తమన్నా కొంత సమయం సందడి చేశారు. చీర కట్టు లో తమన్నా ను పార్లమెంట్‌ లో చూడటం జరిగింది.

పార్లమెంట్ లో ఆమె దిగిన వెంటనే మీడియా ఆమెను చుట్టు ముట్టారు. పెద్ద ఎత్తున మీడియా వారు ఆమెను పలకరించేందుకు ప్రయత్నించారు. పార్లమెంట్ లో మహిళ బిల్లు ప్రవేశ పెట్టడం పట్ల తన సంతోషం ను మిల్కీ బ్యూటీ తమన్నా వ్యక్తం చేసింది.

ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే సూపర్ స్టార్ రజినీకాంత్‌ జైలర్ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా సూపర్‌ హిట్ అవ్వడం తో తమిళం లో ఈమె మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగు లో ఈమె నటించిన భోళా శంకర్ సినిమా నిరాశ పరచడంతో ఇక్కడ పెద్దగా ఆఫర్లు రావడం లేదు అనే టాక్‌ వినిపిస్తుంది.

హీరోయిన్‌ గా ఆఫర్లు వచ్చినా రాకున్నా కూడా ఈ అమ్మడు రెగ్యులర్‌ గా సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ ను షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతే కాకుండా ఐటం సాంగ్స్ ల్లో లేదా ప్రైవేట్ మ్యూజిక్‌ ఆల్బం ల్లో కూడా కనిపిస్తూ సందడి చేస్తోంది.