Begin typing your search above and press return to search.

నా తల్లిదండ్రులు కూడా నన్ను అలా అడగరు!- త‌మ‌న్నా

తమన్నా భాటియా ఇటీవల చెన్నైకి వెళ్లి అక్కడ ఓ కార్యక్రమంలో భాగంగా అభిమానులతో సంభాషించారు. తమన్నా పాత్రలు, సినిమాల గురించి అభిమానులు ప్ర‌శ్నించారు.

By:  Tupaki Desk   |   9 Sep 2023 3:59 AM GMT
నా తల్లిదండ్రులు కూడా నన్ను అలా అడగరు!- త‌మ‌న్నా
X

పెళ్లి ప్రశ్నలపై తమన్నా భాటియా, విజ‌య్ వ‌ర్మ ర‌క‌ర‌కాల సంఘ‌ట‌న‌ల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు. మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తన పెళ్లి గురించి ఒక అభిమాని ప్రశ్నించినప్పుడు అసంతృప్తిని వ్యక్తం చేసింది. నీకు ఎప్పుడు పెళ్లి? అని అత‌డు విసిగించాడు.


అయినా ఈ ప్రశ్నకు త‌మ‌న్నా చిరునవ్వుతో సమాధానమిస్తూ.. ''నా తల్లిదండ్రులు కూడా నన్ను అలా అడగరు'' అని ప్ర‌తిస్పందించింది. ఈ జూన్‌లో తమన్నా భాటియా నటుడు విజ‌య్ వర్మతో తన సన్నిహిత సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నామ‌ని వెల్ల‌డించారు. త‌మ విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నారు. విదేశీ విహార యాత్ర‌ల‌తోను ఆస్వాధ‌న‌ల్లో ఉన్నారు. ఈ జంట నెట్‌ఫ్లిక్స్ 'లస్ట్ స్టోరీస్ 2'లో కలిసి న‌టించిన‌ప్ప‌టి నుంచి మ‌రింత‌గా స‌న్నిహితుల‌య్యారు.

తమన్నా భాటియా ఇటీవల చెన్నైకి వెళ్లి అక్కడ ఓ కార్యక్రమంలో భాగంగా అభిమానులతో సంభాషించారు. తమన్నా పాత్రలు, సినిమాల గురించి అభిమానులు ప్ర‌శ్నించారు. అయితే ఒక అభిమాని నుండి ఎదురైన పెళ్లి ప్ర‌శ్న చికాకు పెట్టింది. ఆ ప్ర‌శ్న‌ తర్వాత మ‌రో ప్ర‌శ్న ఇలాంటిదే. 'మీకు మంచి వ్యక్తి దొరికారా? అని కూడా ఒక అభిమాని అడిగాడు. దానికి స్పందిస్తూ ''నేను ప్రస్తుతం నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను.. అవును చాలా హ్యాపీగా ఉన్నాను'' అని త‌మ‌న్నా జ‌వాబిచ్చింది.

ఇలాంటి ప్ర‌శ్న‌లే న‌టుడు విజ‌య్ వ‌ర్మ ప‌దే ప‌దే ఎదుర్కొంటున్నాడు. ఇటీవల విజయ్‌కి విమానాశ్రయంలో స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల నుంచి అనూహ్య‌మైన చికాకు పెట్టే ప్రశ్న కూడా ఎదురైంది. మాల్దీవుల్లో ఇద్ద‌రూ బాగా ఎంజాయ్ చేసారా? అనేదే ఆ ప్ర‌శ్న‌. విజయ్ ఆ ప్రశ్నతో విసిగిపోయినప్పటికీ మర్యాదపూర్వకంగా...మీరు ఇలా మాట్లాడాల్సింది కాదు! అని అన్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.... తమన్నా భాటియా చివరిసారిగా రజనీకాంత్ జైలర్‌లో అతిధి పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలోని 'కావాలా..' పాట అంతర్జాలంలో సునామీగా మారింది. తమ‌న్నా గ్లామ‌ర్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ దృష్ట్యా ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్‌గా మారింది. చిరంజీవితో క‌లిసి న‌టించిన భోళాశంక‌ర్ ఈ సీజ‌న్ లో మ‌రో పెద్ద సినిమా.

త‌మ‌న్నా తదుప‌రి వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంది. బాంద్రా, అరణ్మనై 4, వీడ వంటి సినిమాలు ఖాతాలో ఉన్నాయి. విజ‌య్ వ‌ర్మ మ‌రోవైపు వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. తదుపరి సుజోయ్ ఘోష్ - జానే జాన్‌లో నటించనున్నాడు. అతడు చివరిగా ప్రైమ్ వీడియో సిరీస్ -దహాద్ .. సస్పెన్స్-క్రైమ్ డ్రామా కాల్‌కూట్‌లో కనిపించాడు.