Begin typing your search above and press return to search.

బంగారు బొమ్మలా మిల్కీ బ్యూటీ

తాజాగా లైట్ గోల్డర్​ కలర్ లెహంగాలో దర్శనమిచ్చింది. జట్టుకు రంగేసి, మత్తెక్కించే చూపులతో భిన్న పోజులు ఇచ్చింది.

By:  Tupaki Desk   |   14 Oct 2023 3:41 PM GMT
బంగారు బొమ్మలా మిల్కీ బ్యూటీ
X

మిల్కీ బ్యూటీ తమన్నా అందం, యాక్టింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 18ఏళ్ల తన కెరీర్​లో 50కి పైగా చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇప్పటికీ తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ కెరీర్​ను సక్సెస్​ ట్రాక్​లో తీసుకెళ్తోంది. తాజాగా ఈ భామ.. గోల్డెన్ కలర్ డ్రెస్​లో కళ్లు చెదిరే రేంజ్​లో ఓపెన్ హార్ట్ షో పోజులిచ్చింది. ప్రస్తుతం నెట్టింట అవి వైరల్‌గా మారాయి.


వివరాళ్లోకి వెళితే.. తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలు సిరీస్​లతో దూసుకెళ్తోంది. రీసెంట్​గా లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా వెబ్​ సిరీస్​తో ఆడియెన్స్​ను అలరించింది. ఇందులో బోల్డ్‌ షోతో రెచ్చిపోయింది. అలాగే చిరంజీవి 'భోళా శంకర్‌', తమిళంలో రజనీకాంత్ 'జైలర్‌'తో పలకరించింది. వీటిలో జైలర్​ ఒకటే బ్లాక్ బాస్టర్ హిట్​గా నిలిచింది.

ఇకపోతే దిగ్గజ నటి స్వర్గీయ జమున బయోపిక్​లోనూ తమన్నా టైటిల్ రోల్​ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె మలయాళంలో బంద్రా, తమిళంలో అరణ్​మణాయ్​, హిందీలో వేద చిత్రాల్లో నటిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి షూటింగ్ జరుపుకుంటున్నాయి.

సోషల్​ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ ఫుల్ యాక్టివ్​గా ఉంటూ అదిరిపోయే ఫొటోషూట్స్​ను పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా లైట్ గోల్డర్​ కలర్ లెహంగాలో దర్శనమిచ్చింది. జట్టుకు రంగేసి, మత్తెక్కించే చూపులతో భిన్న పోజులు ఇచ్చింది.

ఆరు ఫొటోలను పోస్ట్ చేసింది. అన్నీ పిక్స్​లోనూ ఎంతో అందంగా కనువిందు చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట బాగా చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసిన నెటిజన్లు స్టన్నింగ్, హాట్, గార్జియస్, హాట్ బేబీ, బ్యూటిఫుల్​ అంటూ హార్ట్ అండ్ హాట్ ఎమోజీలతో కామెంట్​ సెక్షన్ బాక్స్​ను నింపేస్తున్నారు.

తమన్నా వ్యక్తిగత జీవిత విషయానికొస్తే.. ఆమె కొంతకాలంగా నటుడు, తెలంగాణాకు చెందిన విజయ్‌తో రిలేషన్​షిప్​లో ఉంటోంది. ఇద్దరు కలిసే తెగ తిరుగుతున్నారు. కెమెరా కంటికి చిక్కుతున్నారు. చాలా సార్లు విజయ్​ అంటే ఎంతో ఇష్టమని కూడా తమన్నా పేర్కొంది.