'దంగల్' నటితో తమన్నా మాజీ లవర్ డేటింగ్?
అయితే తమన్నా నుంచి విడిపోయిన నటుడు విజయ్ వర్మ ప్రస్తుతం 'దంగల్' బ్యూటీ ఫాతిమా సనా షేక్ తో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 23 Jun 2025 8:50 PM ISTమిల్కీ వైట్ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని నెలల వ్యవధిలోనే ఈ జంట విడిపోవడం ఆశ్చర్యపరిచింది. తమన్నా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలవ్వాలనే నిర్ణయాన్ని అతడి ముందు ఉంచడంతో, కెరీర్ పరంగా ముందుకు వెళ్లాలనేది తన ప్రాధాన్యత అని విజయ్ చెప్పడంతో, ఆ ఇద్దరూ ఎవరి దారిలో వారు వెళ్లాల్సి వచ్చిందని కథనాలొచ్చాయి. విజయ్ తన కెరీర్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడు. కానీ తమన్నా ఇక కెరీర్ పరుగును చాలించి, విజయ్ ని పెళ్లాడి పిల్లల్ని కనాలని, లైఫ్ లో సెటిలవ్వాలని ఆశించింది. కానీ ఆశించినది జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? కారణం ఏదైనా ఈ జంట విడిపోయింది.
అయితే తమన్నా నుంచి విడిపోయిన నటుడు విజయ్ వర్మ ప్రస్తుతం 'దంగల్' బ్యూటీ ఫాతిమా సనా షేక్ తో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ జంట కలిసి సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. మెట్రో ఇన్ డినోలో కూడా కలిసి నటించారు. అప్పటి నుంచి వారి మధ్య స్నేహం ఉంది. తదుపరి మరో వెబ్ సిరీస్ లో కూడా కలిసి నటించనున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం ముదిరిందని పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఇద్దరూ కలిసి ఔటింగులకు వెళుతున్నారు. ఇటీవల డిన్నర్ డేట్ లో కలిసారు. కేఫ్ లో కలిసి కనిపించినప్పుడు రెడ్డిటర్ల కంట పడ్డారు. ఆ సమయంలో ఒకరిని వీడి ఒకరు వెళుతూ డీప్ హగ్ ఇచ్చుకుని కనిపించారు. ప్రస్తుతానికి ఈ జంటపై ఇవన్నీ పుకార్లు మాత్రమే. ఆ ఇద్దరిలో ఎవరూ అధికారికంగా దీనిని కన్ఫామ్ చేయలేదు.
విజయ్ - ఫాతిమా వారి తదుపరి చిత్రం 'గుస్తాఖ్ ఇష్క్'లో కలిసి కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట డేటింగ్ పై నెటిజనులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ విజయ్ వర్మ గురించి వ్యాఖ్యానిస్తూ, తమన్నా గురించి అతడు ఎప్పుడూ సీరియస్ గా ఆలోచించలేదు. పలుకుబడి కోసం నటీమణులతో డేటింగ్ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఫాతిమా డేటింగ్ పుకార్లపై కంటే, కెరీర్ పై దృష్టి సారిస్తే బావుంటుందేమోనని ఒక నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేసాడు. ఇక పాతిమా సనా షేక్ 'దంగల్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కథానాయకుడు అమీర్ ఖాన్ తో డేటింగ్ వ్యవహారంపైనా మీడియాలో కథనాలొచ్చాయి.
