Begin typing your search above and press return to search.

వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై మిల్కీ బ్యూటీ సెన్సేష‌న‌ల్ కామెంట్స్

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై తీవ్ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 July 2025 12:31 PM IST
వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై మిల్కీ బ్యూటీ సెన్సేష‌న‌ల్ కామెంట్స్
X

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై తీవ్ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఎంతోమంది ఈ విష‌యంపై మాట్లాడి త‌మ త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించ‌గా ఇప్పుడు మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా లాంగ్ వ‌ర్కింగ్ అవ‌ర్స్ మ‌రియు హెల్తీ షెడ్యూళ్ల‌ అవ‌స‌రం గురించి మాట్లాడారు. రీసెంట్ గా జ‌రిగిన ఇండియ‌న్ కౌచ‌ర్ వీక్ సంద‌ర్భంగా త‌మ‌న్నా ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఈ విష‌యంలో త‌మ‌న్నా మాట్లాడుతూ త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌ను చాలా నిజాయితీగా వెల్ల‌డించారు. వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్ ను తాను న‌మ్మ‌న‌ని, మ‌న‌లో ఉండే ఇన్న‌ర్ బ్యాలెన్స్ ను మాత్ర‌మే తాను న‌మ్ముతాన‌ని త‌మ‌న్నా ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. అస‌లు వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అబ‌ద్ధ‌మ‌నేది త‌న అభిప్రాయ‌మ‌ని, మ‌నం బ్యాలెన్స్ గా ఉంటే ఆ త‌ర్వాత వ‌ర్క్, లైఫ్ బ్యాలెన్డ్స్‌గా ఉంటాయ‌ని తమ‌న్నా అన్నారు.

దీపికా పందుకొణె స్పిరిట్ సినిమా నుంచి త‌ప్పుకోవ‌డానికి చెప్పిన ప్ర‌ధాన కార‌ణం వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్న విష‌యం తెలిసిందే. డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి దీపికాను 8 గంట‌లు వ‌ర్క్ చేయ‌మ‌ని అడ‌గ్గా దాన్ని ఆమె రిజెక్ట్ చేయ‌డంతో ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో వ‌ర్కింగ్ అవ‌ర్స్ అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి టైమ్ లో త‌మ‌న్నా ఈ వ్యాఖ్య‌లు చేయ‌డంతో అవి నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే ఇండియా కౌచ‌ర్ వీక్ లో త‌మ‌న్నా రాహుల్ మిశ్రా లేటెస్ట్ క‌లెక్ష‌న్ల‌లో రెండు ర‌కాల క‌స్మ్ కోచ‌ర్ దుస్తుల్లో క‌నిపించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. అందులో భాగంగా ముందుగా శ‌రీరానికి అతుక్కుని పోయే డిజైన‌ర్ వేర్ లో సింపుల్ మేక‌ప్ తో త‌డి జుట్టుతో క‌నిపించగా, ఆ త‌ర్వాత ఓ ఫ్లోర‌ల్ లెహంగాలో మ‌రింత అందంగా క‌నిపించారు. ఈ దుస్తుల్లో త‌మ‌న్నా మునుప‌టి కంటే అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.