Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : మిల్కీ బ్యూటీ మెరుపులు తగ్గలేదు

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతోంది. ఈమె మొదటి తెలుగు సినిమా శ్రీ విడుదల అయ్యి 20 ఏళ్లు కావస్తుంది.

By:  Tupaki Desk   |   30 Jun 2025 2:10 PM IST
పిక్‌టాక్ : మిల్కీ బ్యూటీ మెరుపులు తగ్గలేదు
X

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతోంది. ఈమె మొదటి తెలుగు సినిమా శ్రీ విడుదల అయ్యి 20 ఏళ్లు కావస్తుంది. ఈమె వయసు సైతం అదే స్థాయిలో పెరుగుతూ వచ్చింది. అయినా కూడా అందం మాత్రం తగ్గడం లేదు. వయసుతో పాటు అందం తగ్గుతుంది అంటారు. కానీ మిల్కీ బ్యూటీకి అలా జరగలేదు. వయసు పెరిగినా కొద్ది మిల్కీ బ్యూటీ అందం పెరుగుతుందా ఏంటి అన్నట్లుగా ఈమె బ్యూటీ ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో తమన్నా అందాల ఆరబోత ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ ఉంటాయి. మరోసారి ఈ అమ్మడి అందాల ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.


ఇండస్ట్రీలో ఈమె జోరు తగ్గినప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం తగ్గడం లేదు. సౌత్‌ హీరోయిన్స్‌లో అతి కొద్ది మందికే సాధ్యం అయిన ఇన్‌స్టా ఫాలోవర్స్‌ను ఈమె సొంతం చేసుకుంది. దాదాపుగా 30 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఒక పార్టీకి హాజరు అయింది. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో ఈ అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదని, తమన్నా మెరుపులు ముందు ముందు మరింతగా ఉండబోతున్నాయి అన్నట్లుగా చెప్పకనే చెబుతున్నట్లు ఉన్నాయి అంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.


క్లీవేజ్ షో తో ఈ అమ్మడు చేసిన సర్‌ప్రైజ్‌కి అంతా కూడా వావ్‌ అంటున్నారు. ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు గతంలో చాలా చూశాం. అయితే తమన్నా ఇండస్ట్రీలో జోరు తగ్గడంతో అందం తగ్గిందని కొందరు చేస్తున్న విమర్శలకు ఈ ఫోటోలు సమాధానం అన్నట్లుగా ఉన్నాయని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. క్లీ వేజ్ షో ఫోటోలతో తమన్నా చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఈ స్థాయిలో అందాల ఆరబోత కేవలం తమన్నాకే సాధ్యం. ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా ఇంతగా అందంగా కనిపించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. తమన్నా ముందు ముందు మరిన్ని పెద్ద సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.


గత ఏడాదిలో తమన్నా నటించిన ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కొన్ని ఐటెం సాంగ్స్ చేసిన సినిమాలు కాగా, మరికొన్ని ముఖ్య పాత్రల్లో నటించిన సినిమాలు కావడం విశేషం. ఇక ఈ ఏడాదిలో ఇప్పటికే తమన్నా ఓదెల 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో శివసత్తు పాత్రలో నటించి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. రైడ్‌ 2 సినిమాలోనూ తమన్నా కన్నుల విందు చేసింది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈమె హిందీలో ఎక్కువ సినిమాలు చేస్తుంది. తెలుగులో ఈమె ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. వచ్చే ఏడాదిలో అయినా ఈమె తెలుగు సినిమాలు ఉంటాయేమో చూడాలి.