ఇలాంటి వ్యూ కనిపిస్తే హాలిడేనే!
రీసెంట్ గా ఓదెల2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా తన హాలిడేను ఎలా ఆస్వాదించిందో తెలుపుతూ ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
By: Tupaki Desk | 19 April 2025 12:44 PM ISTరీసెంట్ గా ఓదెల2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా తన హాలిడేను ఎలా ఆస్వాదించిందో తెలుపుతూ ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో గార్డెన్ లో బాతులు నడుస్తున్న ఒక ప్రశాంతమైన సీనిక్ వ్యూ కనిపించింది. రూమ్ బయట బాతులు కనిపించినప్పుడే మనకు హాలిడే అని తెలుస్తోందంటూ తమన్నా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
తాజాగా ఓదెల2 అనే సూపర్ నేచురల్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ను పలకరించిన తమన్నా ఆ సినిమాలో తన నటనకు మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో తమన్నా చెప్పులు కూడా లేకుండా నడిచిందని, ఈ మూవీ కోసం తమన్నా పూర్తి వెజిటేరియన్ గా మారడంతో పాటూ సినిమా కోసం ఎంతగానో కష్టపడిందని ఓదెల2 స్టోరీ రైటర్ మరియు ప్రెజెంటర్ సంపత్ నంది వెల్లడించాడు.
తమన్నా నాగ సాధువుగా నటించిన ఈ సినిమాలోని ఆ లుక్ వెనుక ఎంతో కష్టముందని, దాని కోసం మూడు డిఫరెంట్ లుక్స్ ను ట్రై చేసినట్టు సంపత్ నంది తెలిపాడు. తమన్నా ఎంతో అందంగా, తెల్లగా ఉంటుంది. కానీ నాగ సాధువులు ఎప్పుడూ ఎండలో ఉండటం వల్ల వాళ్ల స్కిన్ టోన్ భిన్నంగా ఉంటుంది. దీంతో తమన్నా కోసం ఎన్ని మేకప్స్ వాడినా, అవి రియలిస్టిక్ ఫీల్ ను తీసుకురాలేకపోయాయని ఆయన చెప్పాడు.
అయితే నాగసాధువుల్లో కూడా ఫారినర్స్ ఉంటారు కాబట్టి వారు తెల్లగానే ఉంటారు కదా అనిపించిందని సంపత్ తెలిపాడు. ఎండలోకి రాగానే తమన్నా స్కిన్ టోన్ పింక్ కలర్ లోకి మారుతుందని, దీంతో సినిమాలో మేకప్ లేకుండా తమన్నాను చూపిద్దామనుకుని డిసైడ్ అయి, డిజైనర్ నీతా లుల్లాకు తాను అనుకున్న రిఫరెన్స్ కాస్ట్యూమ్స్ ను పంపగా, ఆమె కొన్ని డిజైన్స్ చేసిందని, వాటిలో అందరూ చూస్తున్న లుక్ ను ఫైనల్ చేసినట్టు సంపత్ నంది తెలిపాడు. ఆ లుక్ కోసం అందరూ ఎంతో కష్టపడ్డామని, చాలా టైమ్ లుక్ ను ఫైనల్ చేయడానికే పట్టిందని, తమన్నా ఎంతో గొప్ప నటి కాబట్టి ఆ పాత్రను చేయగలిగిందని ఆయన వెల్లడించాడు. అయితే ఎంత కష్టపడినప్పటికీ తమన్నాకు ఓదెల2తో అనుకున్న ఫలితం మాత్రం అందుకోలేకపోయింది.
