Begin typing your search above and press return to search.

తమన్నా ఓదెల 2.. హృదయాన్ని కదిలించే పాట విన్నారా?

స్టార్ హీరోయిన్ తమన్నా.. అటు వెబ్ సిరీస్ లు ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 April 2025 6:57 AM
Odela 2 Emulada Rajanna Song Strikes a Divine Chord
X

స్టార్ హీరోయిన్ తమన్నా.. అటు వెబ్ సిరీస్ లు ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఓదెల 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది అమ్మడు. బ్లాక్ బస్టర్ హిట్ ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఆ సినిమా.. ఏప్రిల్ 18వ తేదీన గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది.


అయితే ఇప్పటికే ఓదెల మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. నిజానికి.. సీక్వెల్ అనౌన్స్మెంట్ నుంచే మోస్తరు అంచనాలు ఉండగా.. టీజర్ రిలీజ్ అయ్యాక ఓ రేంజ్ లో హైప్ నెలకొంది. ఆ తర్వాత ట్రైలర్ వచ్చాక.. మొత్తం అందరి దృష్టి మూవీపై పడింది. దైవం వర్సెస్ దెయ్యం అనేలా సాగిన ట్రైలర్.. ఫుల్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.

ఇక మూవీ రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ మరింత జోష్ తో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా ఈవెంట్ ను ఏర్పాటు చేయగా.. ఆ సందర్భంగా తమన్నాతోపాటు హీరో శర్వానంద్ చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో మేకర్స్ రిలీజ్ చేసిన ఎమూలాడ రాజన్న సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

హృదయాన్ని కదిలించే పాట అంటూ మేకర్స్ రిలీజ్ చేయగా... ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఊరికేమో నాలుగు దిక్కులు ఉన్నవి.. ఊరి జనానికి ఏమో ఏ దిక్కుల లేకున్నది.. జంగమా అంటూ సాగుతున్న పాట.. మంచి వైబ్ క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. ఒక్కొక్క లిరిక్.. హృదయాన్ని కదలిస్తుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ముఖ్యంగా లిరికల్ సాంగ్ లో ప్రతీ విజువల్ కూడా అద్భుతంగా ఉంది. రా రా మల్లన్న అంటూ లిరిక్స్ వస్తుండగా.. ప్రతి ఒక్కరూ డివైన్ వైబ్ లోకి వెళ్లిపోవడం పక్కా. సంపత్ నంది అదిరిపోయిన లిరిక్స్ అందించగా.. అజనీష్ లోక్ నాథ్ తనదైన శైలిలో బాణీలు కట్టారు. అనిరుథ్ శాస్త్రి తన గాత్రంతో ప్రాణం పోశారు. మొత్తానికి సాంగ్ మాత్రం అందరినీ మెప్పిస్తోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది రూపొందిస్తున్న సినిమాలో తమన్నాతో పాటు హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు యాక్ట్ చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఓదెల 2 ఎలా ఉంటుందో వేచి చూడాలి.