ఇది తమన్నా అరుధంతి అవుతుందా..?
రెండు దశాబ్దాలుగా సౌత్ సినీ పరిశ్రమలో కథానాయికగా రాణిస్తుంది మిల్కీ బ్యూటీ తమన్నా. తెలుగు, తమిళ భాషల్లో అమ్మడి క్రేజ్ తెలిసిందే.
By: Tupaki Desk | 14 April 2025 10:00 AM ISTరెండు దశాబ్దాలుగా సౌత్ సినీ పరిశ్రమలో కథానాయికగా రాణిస్తుంది మిల్కీ బ్యూటీ తమన్నా. తెలుగు, తమిళ భాషల్లో అమ్మడి క్రేజ్ తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచి తన మార్క్ నటనతో ఆకట్టుకుంటూ వచ్చిన తమన్నా యువ హీరోలతో పాటు స్టార్స్ తో కూడా జత కట్టింది. హీరోయిన్స్ అంతగా డ్యాన్స్ చేయడం కష్టమని అంటారు. కానీ తమన్నా విషయంలో ఆ లెక్క వేరుగా ఉంటుంది. అందుకే ఆమెను స్పెషల్ సాంగ్స్ కి సైతం ఎంపిక చేస్తారు. ఇప్పటికీ తమన్నా ప్రత్యేక గీతాల్లో కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.
ఐతే తమన్నా నుంచి లేటెస్ట్ గా వస్తున్న సినిమా ఓదెల 2. సంపత్ నంది కథ, దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న సినిమా ఇది. ఓదెల రైల్వే స్టేషన్ హిట్ అవ్వడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా ఓదెల 2 వస్తుంది. ఐతే ఈ సీక్వెల్ భారీగా ఉంటుందని ప్రచార చిత్రాలు చూస్తేనే తెలుస్తుంది. ఇక ఈమధ్యనే రిలీజైన ఓదెల 2 ట్రైలర్ చూస్తే తమన్నా నట విశ్వరూపం చూపించిందా అనిపించేలా చేసింది.
కెరీర్ లో కమర్షియల్ సినిమా ఛాన్స్ లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ ఇలాంటి టిపికల్ రోల్స్ అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. ఆ టైం లో దాన్ని పట్టుకోవడంలోనే అసలైన మజా ఉంటుంది. తమన్నా ఓదెల 2 లో చేయడం ఇప్పుడున్న పరిస్థితిలో ఆమె కెరీర్ కి మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు. ఐతే కొందరు తమన్నా ఓదెల 2 ని అనుష్క అరుంధతి తరహాలో ఉంటుందని ఇది తమన్నా అరుంధతి అంటున్నారు.
బహుబ్శా ట్రైలర్ చూసి కొందరు అలా గెస్ చేయొచ్చేమో కానీ అరుంధతి లాంటి రిజల్ట్ ఓదెల 2 అందుకుంటే మాత్రం కచ్చితంగా తమన్నాకి ఇలాంటి ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు మరికొన్ని వచ్చే ఛాన్స్ ఉంటుంది. సంపత్ నంది డైరెక్ట్ చేసిన సినిమాల్లో కూడా తమన్నా హీరోయిన్ గా అలరించింది. ఆ రిలేషన్ కొద్దీ ఓదెల 2 లో తమన్నాని తీసుకొచ్చారు. ఓదెల 2 మీద టీం అంతా కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఈ వారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఓదెల 2 సక్సెస్ ఐతే తప్పకుండా తమన్నా కూడా ఇదే తరహా సినిమాలు మరికొన్నిటిని చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు.
