Begin typing your search above and press return to search.

బంప‌రాఫ‌ర్ కొట్టేసిన మిల్కీ బ్యూటీ

రీసెంట్ గానే వారి ల‌వ్ బ్రేక‌ప్ అయింద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు త‌మ‌న్నాకు ల‌క్ క‌లిసొస్తుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   17 April 2025 7:51 AM
Tamannaah Bumper Offer In No Entry 2
X

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అందం, త‌న టాలెంట్ గురించి కొత్త‌గా చెప్పుకోన‌క్క‌ర్లేదు. సౌత్ లోని స్టార్ హీరోలంద‌రితో క‌లిసి న‌టించిన త‌మ‌న్నా భాటియా గ‌త కొంత కాలంగా చెప్పుకోద‌గ్గ సినిమాలేమీ చేయ‌లేదు. త‌న డ్యాన్సుల‌తో ఎంతో ఫేమ‌స్ అయిన త‌మ‌న్నా, కొన్ని స్పెష‌ల్ సాంగ్స్ లో కాలు క‌దిపి అంద‌రినీ అల‌రిస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

గ‌త కొంత‌కాలంగా త‌మ‌న్నా విజ‌య్ వ‌ర్మ‌తో ల‌వ్ లో ఉంద‌ని, రీసెంట్ గానే వారి ల‌వ్ బ్రేక‌ప్ అయింద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు త‌మ‌న్నాకు ల‌క్ క‌లిసొస్తుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. దానికి కార‌ణం నో ఎంట్రీ2 లాంటి పెద్ద ప్రాజెక్టులో త‌మ‌న్నా హీరోయిన్ గా సంతకం చేయ‌డ‌మే. అలాంటి ప్రిస్టీజియ‌స్ ప్రాజెక్టులో భాగం కావ‌డం త‌మ‌న్నా అదృష్ట‌మే అంటున్నారు.

త‌మ‌న్నా కెరీర్ ఫినిష్ అయిపోయింద‌ని, ఇక ఆమెకు స్పెష‌ల్ సాంగ్ లో ఆఫ‌ర్లు త‌ప్పించి ఇంకేం రావ‌ని అందరూ అనుకున్నారు. అలాంటి స్థాయి నుంచి ప్రామిసింగ్ ప్రాజెక్టుల్లో ఆఫ‌ర్లు అందుకునే స్థాయికి చేరుకుంది త‌మ‌న్నా ఇప్పుడు. త‌మ‌న్నా న‌టించిన ఆజ్ కీ రాత్, కావాల‌య్యా సాంగ్స్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవ‌డంతో త‌మ‌న్నా టాలెంట్ గురించి అంద‌రికీ తెలిసింది.

దాంతో పాటూ త‌మ‌న్నా నుంచి గ‌తేడాది వ‌చ్చిన త‌మిళ సినిమా అరణ్మ‌నై కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఇక త‌మ‌న్నా తాజా చిత్రం ఓదెల2 పై కూడా మంచి అంచ‌నాలున్నాయి. ఈ సినిమాలో త‌మ‌న్నా పెర్ఫార్మెన్స్ గురించి అంద‌రూ చాలా గొప్ప‌గా చెప్తున్నారు. ఓదెల2 త‌ర్వాత త‌మ‌న్నాకు మంచి అవ‌కాశాలొస్తాయ‌ని అంద‌రూ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. దానికి తోడు త‌మ‌న్నా త‌న అప్పియరెన్స్ తో ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గానే నిలుస్తూ ఉంటుంది.

ఇక నో ఎంట్రీ విష‌యానికొస్తే ఈ సినిమాలో నో ఎంట్రీ మూవీ లో ఉన్న‌ట్టు అనిల్ క‌పూర్, స‌ల్మాన్ ఖాన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ లేక‌పోయినా ఈ సినిమా కూడా ఓ గొప్ప ప్రాజెక్టు అవుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. త‌మ‌న్నా సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్టులు ప్రామిసింగ్ గా ఉండ‌టంతో ఫ్యాన్స్ ఆ సినిమాల కోసం వెయిట్ చేస్తూ, ఆమె మ‌ళ్లీ వ‌రుస సినిమాలు చేస్తున్నందుకు సంతోషిస్తున్నారు.