మాజీ కమీషనర్ సతీమణిగా మిల్కీబ్యూటీ!
ఉగ్రవాదుల నుంచి నగరాన్ని రక్షించడంలో తన భర్తకు ఎప్పుడూ తోడుగా నిలిచింది. సినిమాలో కీలకంగా నిలిచే ఈ పాత్రకు ప్రాణం పోసేందుకు తమన్నా సిద్దంగా ఉందని మేకర్స్ తెలిపారు.
By: Tupaki Desk | 21 April 2025 8:30 AMముంబై మాజీ కమీషనర్ రాకేష్ మారియా జీవిత కథను కాఫ్ స్టోరీల కింగ్ రోహిత్ శెట్టి తెరకెక్కిస్తోన్న సగతి తెలిసిందే. రాకేష్ పాత్రలో జాన్ అబ్రహంను తీసుకున్నారు. అయితే రాకేష్ భార్య ప్రీతి పాత్రలో ఎవరు నటిస్తారు? అన్న దానిపై కొన్ని రోజులుగా సస్పెన్స్ నడుస్తోంది. తాజాగా ఆ పాత్రకు మిల్కీబ్యూటీ తమన్నాను ఎంపిక చేసారు. సినిమాలో ఈ పాత్ర ఎంతో కీలకమైనది. ఎందుకంటే రాకేష్ కెరీర్ కి ప్రీతి మూలస్థబంలా నిలబడ్డారు.
ఉగ్రవాదుల నుంచి నగరాన్ని రక్షించడంలో తన భర్తకు ఎప్పుడూ తోడుగా నిలిచింది. సినిమాలో కీలకంగా నిలిచే ఈ పాత్రకు ప్రాణం పోసేందుకు తమన్నా సిద్దంగా ఉందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు ఇంకా ఎలాంటి టైటిల్ నిర్ణయించలేదు. రాకేష్ కథ కావడంతో? ఆయన పేరుతోనే టైటిల్ ఉంటుందా? కొత్త టైటిల్ పెడతారా? అన్నది తెలియాల్సి ఉంది. తమన్నా -జాన్ అబ్రహం ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఇద్దరు జంటగా ఇప్పటికే `వేద` సినిమాలో జంటగా నటించారు. తొలి సినిమాతోనే బాలీవుడ్ క్రేజీ జోడీగా మారిపోయారు. ఆ కాంబినేషన్ కి మంచి గుర్తింపు దక్కింది. ఈ నేపథ్యంలోనే జాన్ సరసన మరోసారి తమన్నాకు ఛాన్స్ ఇచ్చారు. తమన్నాకిది బాలీవుడ్ లో మరో గొప్ప ఛాన్స్. ఇంత వరకూ బయోపిక్ ల్లో నటించే అవకాశం రాలేదు. తొలిసారి ఆ ఛాన్స్ అందుకుంది. భార్య పాత్రలు తమన్నాకు కొత్త కాదు.
కానీ కమీషనర్ భార్య పాత్ర అంటే మరింత సెటిల్డ్ పెర్పార్మెన్స్ ఇవ్వాలి. అందులో తమన్నా తప్పక నిరూ పించుకోవాల్సిందే. ఇప్పుడిప్పుడే అమ్మడు టాలీవుడ్ లో లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతో ఫేమస్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే `ఓదెల 2` అనే సినిమా చేసింది. ఇటీవలే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
రాకేష్ మారియా విషయాలోకి వెళ్తే...ఒకప్పుడు ముంబైని కంట్రోల్ చేసిన గ్రేట్ కమీషనర్ గా రాకేష్ కి పేరుంది. 1993లో జరిగిన వరుస బాంబు కేసుల దాడిని చేధించిన సక్సెస్ ట్రాక్ ఉంది.1981 నుంచి 2017 వరకూ పోలీస్ దళంలో తనదైన మార్క్ వేసారు రాకేష్. ముంబై మాఫియాని సైతం గడగడలాడించిన ట్రాక్ రికార్డు రాకేష్ కి ఉంది. పేరు మోసిన గ్యాంగ్ స్టర్లను జైళ్లలో పెట్టి మక్కలు ఇరగదీసిన ఘనడు. రాజకీయ ఒత్తిడులకు తలొంచకుండా పనిచేసిన చరిత్ర రాకేష్ ది. తప్పు చేసిన వాడి తాట తీయడమే రాకేష్ సార్ రూలింగ్ లో నడించింది.