తమన్నా ఏమి చేసింది నేరం.. ఆమెపై ఎందుకు కన్నడ కోపం?
ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. రెండేళ్ల కాలానికి రూ.6.2 కోట్లు చెల్లించేలా "కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ సంస్థ" (కే.ఎస్.డీ.ఎల్) ఆమెతోఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ విషయం కన్నడ నాట కొత్త రచ్చకు తెరలేపింది.
By: Tupaki Desk | 23 May 2025 12:19 PM ISTమైసూర్ శాండల్ సోప్ ఎంతో ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. అలాంటి సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా నటి తమన్నా ఎంపికయ్యారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. రెండేళ్ల కాలానికి రూ.6.2 కోట్లు చెల్లించేలా "కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ సంస్థ" (కే.ఎస్.డీ.ఎల్) ఆమెతోఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ విషయం కన్నడ నాట కొత్త రచ్చకు తెరలేపింది.
అవును... మైసూర్ శాండిల్ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నాతో కే.ఎస్.డీ.ఎల్. ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సోప్ తో పాటు ఆ సంస్థకు చెందిన ఇతర ఉత్పత్తులకు కూడా ఆమె ప్రకటనలు చేయనున్నారు. దీంతో.. కన్నడనాట వివాదానికి తెరలేచింది. కర్ణాటకలో ఎంతో మంది టాలెంటెడ్ వ్యక్తులు ఉన్నప్పటికీ.. ఇతర రాష్ట్రానికి చెందిన తమన్నానే ఎందుకు ఎంచుకున్నారంటూ విమర్శలు మొదలయ్యాయి.
ఈ సమయంలో సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఆమెను అభినందిస్తుంటే.. మరికొంతమంది మాత్రం కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఆమెపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందంటూ విమర్శిస్తున్నారు. కర్ణాటకలో ఉన్న ఎంతో మంది టాలెంటెడ్ వ్యక్తులు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
దీంతో... కర్ణాటక వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. ఈ సబ్బులపై రాష్ట్రంలో ఇప్పటికే మంచి డిమాండ్ ఉందని.. ఈ నేపథ్యంలో ఈ ప్రొడక్ట్ ని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు. పలువురు వాణిజ్య నిపుణుల సలహాతోనే తమన్నాను ఎంపిక చేసినట్లు మంత్రి క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఈ వివాదంపై తమన్నా ఇంకా స్పందించలేదు!
కాగా... 1990 సంవత్సరంలో మైసూర్ రాజు కృష్ణరాజ్ వడియార్-4.. మైసూర్ శాండిల్ సోప్ సంస్థను బెంగళూరులో స్థాపించారు. ఈ క్రమంలో 1916లో సబ్బుల తయారీలో వేగవంతమైన ఈ సంస్థ... కర్ణాటకతో పాటు దక్షిణ భారతదేశంలో ఎంతో పేరు తెచ్చుకుంది. అలాంటి చరిత్ర కలిగిన సంస్థకు తమన్నాను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం.. అమె కెరీర్ లో మైలురాయి అని అంటున్నారు.
అయితే... ఈ ఎంపికను కొంతమంది కన్నడిగులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు! కర్ణాటకలో ఎంతో మంది టాలెంటెడ్ వ్యక్తులు ఉన్నప్పటికీ.. ఇతర రాష్ట్రానికి చెందిన తమన్నానే ఎంచుకోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.
