హాట్ బ్యూటీలు ఇలా కూడా కోల్పోతారా?
మిల్కీ బ్యూటీ తమన్నా గత కొంత కాలంగా స్పెషల్ ఐటమ్ నంబర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 22 Dec 2025 11:42 AM ISTమిల్కీ బ్యూటీ తమన్నా గత కొంత కాలంగా స్పెషల్ ఐటమ్ నంబర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన విషయం తెలిసిందే. `కేజీఎఫ్` నుంచి `జైలర్` మూవీ వరకు తమన్నా చేసిన స్పెషల్ సాంగ్స్ ఆయా సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి మరింత గ్లామర్‌ని జోడించాయి. ఆయా సినిమాలకు ప్లస్ అయ్యాయి. దీంతో ఐటమ్ నంబర్ల కోసం ఎదురుచూసే డైరెక్టర్లకు తమన్నా హాట్ ఫేవరేట్‌గా మారింది. అలా హాట్ ఐటమ్ నంబర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మిల్కి బ్యూటీకి తాజాగా ఓ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ షాక్ ఇచ్చాడట.
తనే ఆదిత్యధర్. యస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన `ధురంధర్` డైరెక్టరే ఆదిత్యధర్. డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో వసూళ్లని రాబడుతూ ట్రేడ్ వర్గాలని, విశ్లేషకుల్ని విస్మయానికి గురి చేస్తోంది. సైలెంట్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన `ధురంధర్` ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లని రాబడుతూ సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు రూ.800 కోట్లకు పైనే వసూళ్లని రాబట్టి దూసుకుపోతోంది.
దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన `ధురంధర్`లోని సాంగ్స్ కూడా ఇప్పుడు నెట్టింట టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అందులోని `శరారత్` ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ పాటలో అయేషాఖాన్ నటించింది. క్రిషటిల్ డసౌజా కూడా అయేషాతో కలిసి స్టెప్పులేసిన ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే ఈ పాపులర్ ఐటమ్ నంబర్ కోసం ముందు అయేషాని అనుకోలేదట. ఈ పాటని మిల్కీ బ్యూటీ తమన్నాతో ముందు చేయాలనుకున్నారట.
ఐటమ్ నంబర్ గురించి అనుకోగానే కొరియోగ్రాఫర్ ఈ పాటకు తమన్నా అయితే ఆ క్రేజ్ వేరుగా ఉంటుందని, తనతోనే ఈ పాట చేద్దామని దర్శకుడికి చెప్పాడట. కానీ దర్శకుడు ఆదిత్యధర్ మాత్రం తమన్నాని తీసుకుంటే ఆమెను చూసి జనాలంతా డిస్ట్రబ్ అవుతారని, తను స్టోరీ వేవ్‌కు అడ్డుపడుతుందని, అంతే కాకుండా సినిమా అంతా పాకిస్థాన్ లో సాగుతుంది కాబట్టి అక్కడి వాతావరణం.. నేటివిటీకి దగ్గరగా ఉండే ఫ్రెష్ ఫేస్ అయితేనే ఆ ఫీల్ ఉంటుందని భావించి తమన్నాని రిజెక్ట్ చేశాడంట.
ఆ కారణంగానే ఆ స్థానంలో అయేషా ఖాన్‌ని ఫైనల్ చేశాడట. అయేషాని తీసుకోవడానికి ముందు ఆమె తెలుగులో చేసిన `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి`, `ఓం బీమ్‌బుష్` సినిమాల్లోని ఐటమ్ నంబర్స్‌ని గమనించారట. అందులో అయేషా ఫ్రెష్‌గా ఉంటుందని కన్ఫమ్ చేసుకున్నాకే తనని ఫైనల్ చేశారని తెలిసింది. `ధురంధర్`లో అయేషా ఖాన్ చేసిన `శరరాత్` సాంగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ తనకు మంచి క్రేజ్‌ని తెచ్చి పెడుతోంది.
