అలా చెప్పుకోవడం అసలు నచ్చదు
ఓదెల2 ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో తన మిల్కీ బ్యూటీ ట్యాగ్, పలు విషయాల గురించి మాట్లాడింది.
By: Tupaki Desk | 17 April 2025 2:21 PM ISTగ్లామర్ ఇండస్ట్రీలో కేవలం అందం వల్లే అవకాశాలొస్తాయనే మాట అబద్దం. గ్లామర్ లేకుండా కేవలం టాలెంట్ తోనే హీరోయిన్లు అయి సత్తా చాటిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే గ్లామర్ ఉంటే అవకాశాలు కొంచెం ఎక్కువ వస్తాయేమో అంతే. అలా అని కేవలం గ్లామర్ మాత్రమే ఉంటే సరిపోదు, ఈ ఇండస్ట్రీలో టాలెంట్, అదృష్టం కూడా ఎంతో ముఖ్యం.
20 ఏళ్ల కిందట ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తమన్నా ఇప్పటికీ అవకాశాలు అందుకుంటూ సినీ ఇండస్ట్రీలో తనదైన సత్తా చాటుతుంది. తాజాగా ఓదెల2 సినిమాతో శివశక్తిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన తమన్నా ఆ సినిమాతో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటుంది. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఓదెల2 ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో తన మిల్కీ బ్యూటీ ట్యాగ్, పలు విషయాల గురించి మాట్లాడింది. తానెప్పుడూ ఒకే తరహా క్యారెక్టర్లకు పరిమితం కావాలనుకోవడం లేదని, అందుకే తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి ఆడియన్స్ ను మెప్పించానని తమన్నా చెప్పుకొచ్చింది.
అందంగా ఉన్నానని తనకు అవకాశాలొచ్చాయనే మాట చెప్పుకోవడం తనకు నచ్చదని తమన్నా ఈ సందర్భంగా తెలిపింది. సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఉన్న అందాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత తమ మీద ఉంటాయని, కానీ సినిమాల ఎంపిక విషయంలో కథ, తమ పాత్రను ఇలా ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకుని సెలెక్ట్ చేసుకుంటామని తమన్నా చెప్పింది. తనకు మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ ను ఫ్యాన్సే ఇచ్చారని, ఆ తర్వాత మీడియా దాన్ని బాగా ప్రచారం చేయడంతో అదే వాడుకలోకి వచ్చిందని తమన్నా వెల్లడించింది.
అయితే మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ తన సినిమాలపై ఎప్పుడూ ఎఫెక్ట్ చూపించలేదని చెప్పిన తమన్నా గతంలో కూడా ఈ విషయంపై మాట్లాడిన విషయం తెలిసిందే. మిల్కీ బ్యూటీ అని పిలిస్తే తనకేం ఇబ్బంది లేదని, కాకపోతే తాను అందంతో కాకుండా టాలెంట్, తాను చేసిన పాత్రలతో ఆడియన్స్ కు గుర్తుండిపోవాలనేది తన కోరికగా చెప్పింది తమన్నా.
