తమన్నా ఇదే కరెక్ట్ రూట్ అనుకుంటే మాత్రం..!
సౌత్ లో అలాంటి క్రేజ్ సంపాదించుకున్న అతి తక్కువ భామల్లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఉంటుంది.
By: Tupaki Desk | 24 April 2025 8:18 PM ISTరెండు దశాబ్దాల నుంచి కథానాయికగా రాణించడం అన్నది చాలా పెద్ద టాస్క్. సౌత్ లో అలాంటి క్రేజ్ సంపాదించుకున్న అతి తక్కువ భామల్లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఉంటుంది. శ్రీ సినిమాతో మొదలైన ఆమె కెరీర్ ఇప్పటికీ తన పాత్రలతో అలరిస్తుంది. సినిమా పట్ల తమన్నాకి ఉన్న ప్యాషన్, అంకిత భావమే ఆమెను ఇక్కడిదాకా తీసుకొచ్చిందని చెప్పొచ్చు.
ఒకప్పుడు స్టార్స్ అందరితో కలిసి నటించిన తమన్నా ఇప్పుడు సెలెక్టెడ్ సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ లో వెబ్ సీరీస్ లతో కూడా అలరిస్తున్న అమ్మడు సౌత్ లో మాత్రం తన మార్క్ చాటే సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. లేటెస్ట్ గా తమన్నా ఓదెల 2 సినిమాలో నటించింది. అశోక్ తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు సంపత్ నంది అన్నీ తానై నడిపించాడు.
ఓదెల కమర్షియల్ ఫ్యాక్టర్స్ ని పక్కన పెడితే తమన్నా చేసిన ఈ అటెంప్ట్ కి ఆడియన్స్ ఇంప్రెస్ అవుతున్నారు. అంతేకాదు తమన్నా ఈ రూట్ లోనే వెళ్తే బెటర్ అని భావిస్తున్నారు. ఓదెల 2 కథ ఇదివరకు చాలా సినిమాల కథలను పోలి ఉందన్న టాక్ ఉన్నా తమన్నా ఇలానే ఫిమేల్ సెంట్రిక్ కథలతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే పాత్రలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.
తమన్నాలో ఉన్న అసలు నటి ఇలాంటి సినిమాలు చేసినప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. ఐతే ఓదెల 2 సినిమా చేస్తున్న టైం లో తమన్నా కూడా ఇక మీదట లేడీ ఓరియెంటెడ్ సినిమాలే అది కూడా కాస్త డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేయాలని అనుకున్నదట. ఓదెల 2 అటెంప్ట్ కి తమన్నా వరకు మంచి మార్కులే పడ్డాయి. ఐతే నెక్స్ట్ సినిమాల్లో కథా బలం కూడా బాగుండే సినిమాలు చేస్తే తను పెట్టే ఎఫర్ట్ కి మించిన రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఐతే ఇన్నేళ్ల కెరీర్ లో ఇప్పటికీ తమన్నాని లీడ్ రోల్ లో పెట్టి సినిమాలు చేస్తున్నారు అంటే అమ్మడి మార్కెట్ మీద నమ్మకం తో పాటు కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెంట్ కూడా ఉంటుంది. ఐతే తమన్నా నెక్స్ట్ ఇలాంటి ఫిమేల్ సెంట్రిక్ ప్రాజెక్ట్ లు చేసినా కాస్త జాగ్రత్త పడితే మళ్లీ కెరీర్ జోష్ తెచ్చే రిజల్ట్ అందుకునే ఛాన్స్ ఉంటుంది.
