తమన్నాకి బ్రేకప్ తిప్పలు..!
మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె గురించి సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా చర్చ జరుగుతూనే ఉంటుందనే విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 10 April 2025 12:56 PM ISTమిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె గురించి సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా చర్చ జరుగుతూనే ఉంటుందనే విషయం తెల్సిందే. గత కొన్నాళ్లుగా తమన్నా గురించి ఇంకాస్త ఎక్కువ చర్చ జరుగుతోంది. నటిగా తమన్నా ఎప్పటిలాగే ఉన్నప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాల కారణంగా వార్తల్లో నిలిచింది. రెండేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్న తమన్నా, విజయ్ వర్మ ఇటీవల బ్రేకప్ అయ్యారు. ఇద్దరి మధ్య పెళ్లి విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయిన కారణంగా బ్రేకప్ అయ్యారు అనేది కొందరి మాట. అసలు విషయం ఏంటి అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్ అనేది ఇద్దరిలో ఏ ఒక్కరు కన్ఫర్మ్ చేయలేదు. కానీ వారి మాటలు, వారి యొక్క తీరు చూస్తూ ఉంటే బ్రేకప్ నిజమే అని తేలిపోయింది. ప్రేమ, పెళ్లి ఆలోచన పక్కన పెట్టి కొన్నాళ్లు పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టాలని తమన్నా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె ఎక్కడ మాట్లాడినా ఆ మాటలను బ్రేకప్‌కి ముడి పెడుతున్నారు. త్వరలో ఓదెల 2 సినిమాతో తమన్నా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తమన్నా మీడియా ముందుకు వచ్చి జీవితంలో తాను ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. దాంతో అంతా కూడా బ్రేకప్ గురించి ఆమె మాట్లాడుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో తమన్నా ఎక్కడ కనిపించినా మీడియా వారు ఆమెను ఏదో ఒక రకంగా విజయ్ వర్మ గురించి ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె వద్ద విజయ్ వర్మ పేరును ఎత్తడం ద్వారా ఆమెకు చిరాకు తెప్పిస్తున్నారు. సాధారణంగా ఒక విషయం గురించి మాట్లాడొద్దు, ఆ విషయం గురించి అసలు ఆలోచించవద్దు అనుకున్నప్పుడు పదే పదే ఆ విషయంను కొందరు కావాలని గుర్తు చేస్తే కచ్చితంగా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడు అదే తమన్నాకు జరుగుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆమెను మీడియా వారు పదే పదే విజయ్ వర్మ గురించి ప్రశ్నించడంతో అసహనం వ్యక్తం చేస్తుంది.
తాజాగా ఒక మీడియా చిట్ చాట్‌లో ఒక మీడియా వ్యక్తి ఇండైరెక్ట్‌గా విజయ్ వర్మ టాపిక్ తీసుకు వచ్చి, అతడితో రిలేషన్ బ్రేకప్ గురించి ప్రశ్నించాడు. ఆ సమయంలో తమన్నా మౌనంగా ఉండి పోయిందట. ఏం మాట్లాడకుండా తర్వాతి ప్రశ్న కోసం వెయిట్ చేసిందట. ఆమెను ఆ ఒక్క ఇంటర్వ్యూలోనే కాకుండా చాలా చోట్ల పదే పదే ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ చిరాకు తెప్పిస్తున్నారట. ఈ విషయంలో మిల్కీ బ్యూటీ తమన్నా పరిస్థితిని అర్థం చేసుకుని కాస్త ఆమెను అలాంటి ప్రశ్నలు అడగవద్దని అభిమానులు, ఆమె సన్నిహితులు కోరుకుంటున్నారు. తమన్నా ఓదెల 2 తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
