Begin typing your search above and press return to search.

త‌మ‌న్నా నిర్మాత‌ల్ని ఇబ్బంది పెట్టదా?

త‌న పారితోషికం మార్కెట్ ఆధారంగానే చెల్లించండని చెబుతుందిట‌. అంత‌కు మించి ఒక్క రూపాయి కూడా అద‌నంగా వ‌ద్ద‌ని క‌రాఖండీగా చెప్పేస్తుందిట‌.

By:  Tupaki Desk   |   11 July 2025 4:00 AM IST
త‌మ‌న్నా నిర్మాత‌ల్ని ఇబ్బంది పెట్టదా?
X

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మిల్కీబ్యూటీ త‌మ‌న్నాది సుదీర్ఘ ప్ర‌స్థానం. దాదాపు రెండు ద‌శాబ్దాలుగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రాణిస్తోంది. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఎన్నో చిత్రాలు చేసింది. న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు ప‌రిశ్ర‌మ‌లో త‌మ‌న్నా ఎంతో ఖ్యాతి గ‌డించింది. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన అభిమానుల్ని సోష‌ల్ మీడియా లేని రోజుల్లోనే సంపాదించుకుంది. సామాజిక మాద్యామాలు వ‌చ్చాక ఆ క్రేజ్ ఇంకా రెట్టింపు అయింది. న‌టిగా, న‌ర్త‌కిగా, అతిధిగా ఎన్నో సినిమా ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించింది.

రెండు ద‌శాబ్ధాల కెరీర్ లో అమ్మ‌డిపై ఏనాడు ఎలాంటి విమ‌ర్శ‌లు కూడా రాలేదు. న‌టిగా ప్ర‌యాణ‌మంతా సాఫీగానే సాగింది. ఏ భాష‌లోనూ వివాదాలు లేవు. ఇలా కొన‌సాగ‌డం అంటే చిన్న విష‌యమా? ఎంతో నిబ‌ద్ధ‌త ఉంటే త‌ప్ప సాధ్యం కాదు. ఆ విష‌యంలో త‌మ‌న్నా ఎంతో గొప్ప‌దే. మ‌రి ఇంత‌టి లాంగ్ కెరీర్ ఎలా సాధ్య‌మైంది? అంటే కేవ‌లం ఇమేజ్ ఒక్క‌టే కాదు. వ్య‌క్తిగ‌తంగా కొన్ని విలువ‌లు కూడా పాటిస్తుంద‌నే విష‌యం ఇన్నాళ్ల‌కు వెలుగులోకి వ‌చ్చింది. పారితోషికం విష‌యంలో త‌మ‌న్నా నిర్మాత‌ల్ని ఎంత మాత్రం ఇబ్బంది పెట్ట‌ద‌ట‌.

త‌న పారితోషికం మార్కెట్ ఆధారంగానే చెల్లించండని చెబుతుందిట‌. అంత‌కు మించి ఒక్క రూపాయి కూడా అద‌నంగా వ‌ద్ద‌ని క‌రాఖండీగా చెప్పేస్తుందిట‌. అన‌వ‌స‌ర‌మైన అద‌న‌పు ఖ‌ర్చులు కూడా నిర్మాత నెత్తిన వేయ‌ద‌ట‌. సెట్స్ కి వ‌చ్చిన త‌ర్వాత త‌న ఖ‌ర్చులు ఏవైనా తానే భ‌రిస్తుందిట‌. నిర్మాత ఇస్తాన‌న్నా? తీసుకోదుట‌. పారితోషికం అందుకునే విష‌యంలో నిర్మాత‌ను మ‌రీ ముక్కు పిండి వ‌సూల్ చేసే టైపు కాదుట‌. చిన్న చిన్న కోతలేవైనా విధించినా తిరిగి నిర్మా త‌ల‌ను అడ‌గ‌ద‌ట‌.

తిరిగి వాళ్ల‌పైనా ఆయ‌న ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాడో? అని సానుభూతి చూపిస్తుందిట‌. ఈ ర‌క‌మైన మ‌న‌స్త‌త్వమే త‌మ‌న్నా లాంగ్ కెరీర్ మ‌రో కార‌ణంగా చెప్పొచ్చు. సాధార‌ణంగా హీరోయిన్లు పారి తోషికం విష‌యంలో డిమాండింగ్ గా ఉంటారు. రూపాయి కూడా వ‌ద‌ల‌రు. ముక్కు పిండి మ‌రీ వ‌సూల్ చేస్తారు అన్న‌ది తెలిసిందే.