Begin typing your search above and press return to search.

'రాగిణి MMS' ఫ్రాంఛైజీకి ఎందుకింత క్రేజ్? మూడో సినిమాలో త‌మ‌న్నా ధ‌మాకా ట్రీట్!

సినిమాల తర్వాత వెబ్ సిరీస్ రూపంలో వచ్చిన `రాగిణి ఎంఎంఎస్: రిటర్న్స్` ద్వారా కొత్త తరం భామలు కరిష్మా శర్మ, రియా సేన్ వంటి వారు ఈ ఫ్రాంఛైజీకి మరింత హైప్ తీసుకొచ్చారు.

By:  Sivaji Kontham   |   11 May 2026 1:04 PM IST
రాగిణి MMS ఫ్రాంఛైజీకి ఎందుకింత క్రేజ్? మూడో సినిమాలో త‌మ‌న్నా ధ‌మాకా ట్రీట్!
X

బాలీవుడ్ తెరపై హర్రర్- ఎరోటిక్ జానర్లను కలిపి ఒక సక్సెస్‌ఫుల్ బ్రాండ్‌గా మార్చిన ఘనత `రాగిణి ఎంఎంఎస్` ఫ్రాంఛైజీకే దక్కుతుంది. భయం గుండెల్లో దడ పుట్టిస్తే... గ్లామర్ యువతను ఉర్రూతలూగిస్తుంది. ఈ రెండు ఎలిమెంట్స్ సరైన పళ్లెంలో వడ్డించడమే ఈ సిరీస్ విజయ రహస్యం. మొదటి రెండు భాగాల భారీ విజయం తర్వాత ఇప్పుడు `రాగిణి ఎంఎంఎస్ 3` ట్రిపుల్ ధమాకా ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇంత‌కుముందు స‌న్నీలియోన్, కాజ‌ల్ వ‌శిష్ట్, క‌రిష్మా శ‌ర్మ వంటి భామ‌లు గ్లామ‌ర‌స్ యాక్ట్ తో కుర్రాకారులో గుబులు పుట్టించారు. ముఖ్యంగా సౌత్ సూపర్ స్టార్ తమన్నా భాటియా మూడో భాగంలో న‌టించేందుకు అంగీక‌రించ‌డంతో ఫ్రాంఛైజీ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఈ సిరీస్ ఆద్యంతం గ్లామరస్ హీరోయిన్ల పెర్ఫార్మెన్స్‌లే ఈ బ్రాండ్‌ను ఇన్నాళ్లు నిలబెట్టాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

హీట్ పుట్టించిన గ్లామ్ డాళ్స్:

ఈ ఫ్రాంఛైజీకి పునాది వేసిన మొదటి భాగంలో కాజల్ వశిష్ఠ్ తన బోల్డ్ నటనతో సంచలనం సృష్టించింది. ఆపై వచ్చిన `రాగిణి ఎంఎంఎస్ 2` ఈ బ్రాండ్ స్థాయిని మార్చేసింది. ఇందులో సన్నీ లియోన్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఆమె అందచందాలు, ఘాటైన శృంగార సన్నివేశాలు.. ఆత్మగా భయపెట్టిన తీరు ప్రేక్షకులను మైమరిపించాయి. సన్నీ పోషించిన పాత్ర ఈ సిరీస్‌కు బిగ్గెస్ట్ గ్లామ‌ర్ ట్రీట్ గా నిలిచిపోయింది. కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం కాకుండా.. హర్రర్ సన్నివేశాల్లోనూ స‌న్నీ చూపిన నటన బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

కొత్త తరం నటీమణుల బోల్డ్ ట్రీట్

సినిమాల తర్వాత వెబ్ సిరీస్ రూపంలో వచ్చిన `రాగిణి ఎంఎంఎస్: రిటర్న్స్` ద్వారా కొత్త తరం భామలు కరిష్మా శర్మ, రియా సేన్ వంటి వారు ఈ ఫ్రాంఛైజీకి మరింత హైప్ తీసుకొచ్చారు. ముఖ్యంగా కరిష్మా శర్మ తన బోల్డ్ యాక్టింగ్ ... అందాల విందుతో ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రతి భాగంలోనూ గ్లామర్ డోస్‌ను పెంచుకుంటూ వెళ్లడం.. ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించడం ఈ సిరీస్ ప్రత్యేకత. ఈ పరంపరలోనే ఇప్పుడు మూడవ భాగం మరింత ఘాటుగా ఉండబోతోందని సమాచారం.

ద్విపాత్రాభినయంతో మిల్కీ బ్యూటీ దడ!

ఇక `రాగిణి ఎంఎంఎస్‌3`లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో ఏక్తా కపూర్ నిర్మించనున్న ఈ చిత్రంలో తమన్నా మోడ్రన్ అమ్మాయిగా- ఆత్మగా ద్విపాత్రాభినయం చేయనుందట. మునుపెన్నడూ లేని విధంగా అత్యంత బోల్డ్ అవతారంలో తమన్నా కనిపించనుందని.. అందాల ఆరబోత - పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్. ఆయుష్ శర్మ, జునైద్ ఖాన్ త‌దిత‌రులు ఇందులో న‌టిస్తున్నారు. ముఖ్యంగా త‌మ‌న్నా చేరిక‌తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

కెరీర్ ట‌ర్న్ అవుతుందా?

తమన్నా వంటి అగ్ర కథానాయిక ఈ రేంజ్‌ బోల్డ్ ఫ్రాంఛైజీని ఎంచుకోవడం నిజంగా కెరీర్‌లో ఒక కీల‌క‌మైన‌ మలుపుగా భావించాలి. గత దశాబ్ద కాలంగా కమర్షియల్ సినిమాలకే పరిమితమైన మిల్కీ బ్యూటీ ఇప్పుడు తనలోని నటిని కొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. ఒక నటిగా తనకున్న హద్దులను చెరిపివేస్తూ.. విభిన్నమైన పాత్రలను పోషించే ధైర్యం చేయడం త‌మ‌న్నా ఇమేజ్‌ను మరింత వెర్సటైల్‌గా మార్చుతుంది. ప్రస్తుత ఓటీటీ కాలంలో ప్రేక్షకులు కూడా నటనలోని వైవిధ్యాన్ని ఆదరిస్తున్నారు కాబట్టి, తమన్నా తీసుకున్న ఈ నిర్ణయం త‌న‌ కెరీర్‌కు కొత్త ఊపిరి పోస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.