Begin typing your search above and press return to search.

డ్యాన్స్ తో కేక పుట్టించిన తమన్నా.. నెట్టింట వీడియో వైరల్..

స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ లో దూసుకుపోతున్నారనే చెప్పాలి. భాషతో సంబంధం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్ సహా ఇతర సినీ ఇండస్ట్రీల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   19 May 2025 1:21 PM IST
డ్యాన్స్ తో కేక పుట్టించిన తమన్నా.. నెట్టింట వీడియో వైరల్..
X

స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ లో దూసుకుపోతున్నారనే చెప్పాలి. భాషతో సంబంధం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్ సహా ఇతర సినీ ఇండస్ట్రీల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఓదెల-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమ్మడు... తన యాక్టింగ్ తో మెప్పించారు. ఇప్పుడు పలు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు.

అదే సమయంలో హీరోయిన్ గా నటిస్తూనే.. అడ‌పాద‌డ‌పా స్పెష‌ల్ సాంగ్స్‌ లో త‌ళుక్కున మెరుస్తున్నారు మిల్కీ బ్యూటీ. ఇప్పటికే ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్.. ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి. సినిమా ఏదైనా స్పెషల్ సాంగ్ అంటే తమన్నానే చేయాలనేంతలా పాపులారిటీ సంపాదించుకుంది.

ఏ సాంగ్ అయినా.. తన డ్యాన్స్ స్కిల్స్, ఎక్స్ప్రెషన్స్ తో ఆడియన్స్ ను కట్టిపడే టాలెంట్ ఆమె సొంతం. ఇప్పుడు ఆమె డ్యాన్స్ చేసిన ఓ సాంగ్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో తమన్నా.. పలు సాంగ్స్ తో మెప్పించారు. తన డ్యాన్స్ తో ఓ రేంజ్ లో సందడి చేశారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

గ్రీన్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో హీట్ పుట్టించే లుక్స్ తో.. తన ఎక్స్ప్రెషన్స్ తో మైమరపించింది తమన్నా. ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ కజరారేకు అయితే అదరగొట్టేసిందని చెప్పాలి. మొత్తానికి తమన్నా వీడియోస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు ఫుల్ గా రెస్పాండ్ అవుతున్నారు. దుమ్ముదులిపేశారని కామెంట్స్ పెడుతున్నారు.

డ్యాన్స్ స్కిల్స్ సూపర్ అని.. ఎక్స్ప్రెషన్స్ వేరే లెవెల్ అని అనేక మంది నెటిజన్లు కొనియాడుతున్నారు. లైక్ కొట్టి వీడియోస్ ను ఇంకా వైరల్ చేస్తున్నారు. లుక్ అదిరిపోయిందని చెబుతున్నారు. ఏ సాంగ్ అయినా.. తమన్నా ఫ్లాట్ చేయడం పక్కా అని అంటున్నారు. మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ అని తమన్నాను ఆకాశానికెత్తేస్తున్నారు.

ఇక కెరీర్ విషయానికొస్తే.. బాలీవుడ్ రైడ్ సీక్వెల్ లో స్పెషల్ సాంగ్ తో సందడి చేయనున్నారు తమన్నా. రీసెంట్ గా ఆ సాంగ్ ప్రోమో రిలీజ్ అవ్వగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రేంజర్ లో యాక్ట్ చేస్తున్న తమన్నా.. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రాజెక్ట్ డయరింగ్ పార్టనర్స్ లో కనిపించనున్నారు. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు.