Begin typing your search above and press return to search.

స్విమ్ సూట్ లో మిల్కీ బ్యూటీ అందాలు!

టీ షేప్ తో ఉండే ఒక పెండెంట్ ను తమన్నా తాజాగా షేర్ చేసింది. ఇందులో స్విమ్ సూట్ ధరించి తన కొత్త మోడల్ జువెలరీ నెక్ చైన్ ని ఇంట్రడ్యూస్ చేసింది.

By:  Madhu Reddy   |   1 May 2026 9:00 PM IST
స్విమ్ సూట్ లో మిల్కీ బ్యూటీ అందాలు!
X

మిల్కీ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న తమన్నా ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే.. మరొకవైపు బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు కొన్ని లగ్జరీ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈమె.. ఇటీవల ఫైన్ జువెలరీ అనే లగ్జరీ బ్రాండ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. రోజూ వారీ వాడకాల కోసం సింపుల్ డిజైన్స్ తో జ్యూవెలరీని రూపొందిస్తోంది. అద్భుతమైన ఆధునిక శైలిలో సౌకర్యవంతంగా ఉండే స్టైలిష్ ఆభరణాలను రూపొందిస్తూ..14, 18 క్యారెట్స్ విలువైన బంగారంతో డిజైన్ చేసిన ఆభరణాలను తన సంస్థ ద్వారా విక్రయిస్తోంది. రత్నాలు , ఆభరణాలను కూడా ఈ బ్రాండ్ ద్వారా అందిస్తోంది. ఇకపోతే తమన్నా తన లగ్జరీ బ్రాండ్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఆభరణాలు సుమారుగా రూ.90 వేల ధరతో ప్రారంభమై రూ.11 లక్షల వరకు విలువైన ఆభరణాలను తన సంస్థ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇకపోతే తన బ్రాండ్ జువెలరీని ఆమె సొంతంగా ప్రమోట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోలు పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.. నిత్యం ఎప్పటికప్పుడు ఫింగర్ రింగ్స్, ఇయర్ రింగ్స్ , బ్యాంగిల్స్ తో పాటు నెక్ చైన్స్ ని ప్రెసెంట్ చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా మరో లేటెస్ట్ ట్రెండీ జువెలరీ ఐటమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీ షేప్ తో ఉండే ఒక పెండెంట్ ను తమన్నా తాజాగా షేర్ చేసింది. ఇందులో స్విమ్ సూట్ ధరించి తన కొత్త మోడల్ జువెలరీ నెక్ చైన్ ని ఇంట్రడ్యూస్ చేసింది.

మొత్తానికైతే మిల్కీ బ్యూటీ తమన్నా ఒక వైపు తన అందాలు ఆరబోస్తూనే మరొకవైపు తన జువెలరీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ మరింత ప్రేక్షకాదరణ పొందే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతూనే ఆమె షేర్ చేసిన జువెలరీ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా అటు అందాలు ఆరబోస్తూనే ఇటు బ్రాండ్ ప్రమోట్ చేస్తూ మరింత బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ.

తమన్నా విషయానికి వస్తే.. శ్రీ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై హ్యాపీడేస్ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. తన అందం , నటనతో ఎన్టీఆర్, చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక స్పెషల్ సాంగ్ లలో కూడా నర్తిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈమె.. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ అదే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఈమె ఆ చిత్రాలతో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.