దీపికకు తమన్నా సపోర్ట్.. ఇదీ అసలు మ్యాటర్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె పేరు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 29 May 2025 3:03 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె పేరు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. అందుకు కారణం స్పిరిట్ మూవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్ గా మేకర్స్ అనుకున్నారు.
కానీ ఆ తర్వాత ఆమెను తప్పించి క్రేజీ బ్యూటీ త్రిప్తి డిమ్రీని సెలెక్ట్ చేశారు. అదే సమయంలో సందీప్ వంగా పెట్టిన పోస్ట్ ఒక్కసారిగా వైరల్ గా మారింది. తాను ఓ నటికి వంద శాతం నమ్మకంతో కథ చెప్పానని, కానీ దాన్ని లీక్ చేయాలని చూశారని ఆరోపించారు. ఏం చేసుకున్నా పర్లేదు.. మొత్తం లీక్ చేసుకోండని మండిపడ్డారు.
ఇదేనా ఫెమినిజమంటూ ఫైర్ అయ్యారు. దీంతో దీపికను ఉద్దేశించే సందీప్ అలా పోస్ట్ చేశారని ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో దీపికకు చెందిన పాత వీడియోను ఇటీవల ఓ అభిమాని షేర్ చేయగా, అందులో ఆమె ఓవర్ టైమ్ పనిచేయడం, ప్రపంచంలో ఉన్న లింగ అసమానత సహా మరికొన్ని విషయాల గురించి ఆమె మాట్లాడారు.
ఆ పోస్ట్ కు స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా లైక్ కొట్టారు. ఆ విషయం వైరల్ అయ్యేలా సదరు దీపిక ఫ్యాన్ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు. ఇంకేముంది.. దీపికకు తమన్నా సపోర్ట్ చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగింది. అనేక కథనాలు కూడా కనిపించాయి. దీంతో ఇప్పుడు తమన్నా ఆ విషయంపై రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇచ్చారు.
తనకు తానుగా పోస్టులను ఇన్ స్టాగ్రామ్ ఎలా లైక్ చేస్తుందో చెబితే బాగుంటుందని తమన్నా అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆ విషయం తెలియని కొందరు ఏకంగా పెద్ద న్యూస్ లాగా ప్రచారం చేశారని మండిపడ్డారు. కానీ తాను పూర్తి చేయాల్సిన పలు వర్క్స్ ఉన్నాయని చెప్పారు. దీంతో కావాలని లైక్ చేయలేదని పరోక్షంగా స్పష్టం చేశారు.
ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే.. వచ్చిన అవకాశాన్ని అందుకుంటూ దుసుకుపోతున్నారు. బాలీవుడ్ రైడ్ సీక్వెల్ లో స్పెషల్ సాంగ్ తో సందడి చేయనున్నారు. రేంజర్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ డయరింగ్ పార్టనర్స్ లో కనిపించనున్నారు. వీటితోపాటు మరిన్ని సినిమాలు, స్పెషల్ సాంగ్స్ ను చేస్తున్నారు అమ్మడు.
