నెం.1 పొజిషన్ లో ఉండటం అంత ఈజీ కాదు
ఓదెల2 రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న తమన్నా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.
By: Tupaki Desk | 6 April 2025 7:00 AM ISTచాంద్ సా రోషన్ చెహ్రా మూవీతో నటిగా అడుగుపెట్టిన తమన్నా అప్పుడే సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో ఓదెల2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది. ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించగా సంపతి నంది కథ అందించారు.
ఓదెల2 రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న తమన్నా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. నటనను తానెప్పుడూ జాబ్ గా చూడలేదని, తాను చేస్తున్న ప్రతీ పనినీ ఎంజాయ్ చేస్తూ చేశానని, అందుకే ఎప్పుడూ ఏ సినిమా విషయంలో తన నటన కష్టంగా అనిపించలేదని తమన్నా తెలిపింది.
టెన్త్ క్లాస్ లోనే సినిమాల్లోకి వచ్చిన తమన్నాకు స్టడీస్ లో టీచర్లు ఎంతో హెల్ప్ చేసేవారట. ఒక్కోసారి ఆమె అసైన్‌మెంట్స్ కూడా టీచర్లే రాసేవారని చెప్తోన్న తమన్నా, రియల్ లైఫ్ లో తాను కాలేజ్ కు వెళ్లలేదని, కానీ రీల్ లైఫ్ లో కాలేజ్ స్టూడెంట్ గా చాలానే సినిమాలు చేశానని, ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే 20 ఏళ్లు అవుతుందంటే నమ్మబుద్ది కావడం లేదని, కెరీర్ మొదలుపెట్టిన కొత్తల్లో ఇన్ని ఏళ్లు ఇండస్ట్రీలో ఉంటాననుకోలేదని తమన్నా అంటోంది.
ఈ సందర్భంగా తమన్నా తన 21వ సంవత్సరంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది. తన బర్త్ డే సందర్భంగా ఒక రోజు షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని ఇంట్లో ఉన్నానని, అప్పుడు న్యూస్ పేపర్లో తనపై ఓ న్యూస్ ఆర్టికల్ వచ్చిందని, అందులో తనను తమిళంలో నెం.1 నటి అని రాశారని చెప్పుకొచ్చింది. అయితే ఆ వార్త చదవగానే తాను కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్తోన్న తమన్నా, అంత త్వరగా ఆ స్థానానికి వెళ్తాననుకోలేదని అందుకే అది చూడగానే ఏడ్చానని తెలిపింది. అయితే నెం.1 ప్లేస్ లో ఉండటం అంత ఈజీ కాదని తెలుసుకున్న అమ్మడు దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని మంచి సినిమాలు చేసి ఆడియన్స్ ను అలరించాలనుకున్నట్టు చెప్పింది.
