Begin typing your search above and press return to search.

దెయ్యం ముందు కూడా త‌మ‌న్నా రా..రా..రా!

త‌మ‌న్నా ఐటం భామ‌గా బిజీ అవ్వ‌డానికి అదీ కూడా కార‌ణం. తాజాగా అమ్మ‌డు బాలీవుడ్ లో నూ ఐటం పాట‌ల‌కి ఒకే చెప్పేసింది.

By:  Tupaki Desk   |   14 April 2024 4:30 PM GMT
దెయ్యం ముందు  కూడా త‌మ‌న్నా రా..రా..రా!
X

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఐటం భామ‌గా ఎంత‌గా ఫేమ‌స్ అయింద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. తొలి ఇన్నింగ్స్ లో హీరోయిన్ గా దూసుకుపోతే సెకెండ్ ఇన్నింగ్స్ లో ఐటం భామ‌గా మార్కెట్ ని షేక్ చేస్తోంది. జైల‌ర్ లో 'రారారా' పాట‌తో ఆటం బాంబ్ గా అమ్మ‌డి రెట్టింపు క్రేజ్ తో దూసుకుపోతుంది. ఐటం భామ కావాలంటే? త‌మ‌న్నా ఎంట్రీతో ద‌ర్శ‌కుల‌కు కొత్తగా మ‌రో నాయిక‌ని వెతుక్కునే ప‌ని త‌గ్గింది. సౌత్ లో ఎలాగూ ఫేమ‌స్ కావ‌డం...అంతా తెలిసిన వారే కావ‌డంతో! ఆమె తో సంప్ర‌దింపులు సుల‌భం అవుతున్నాయి.

త‌మ‌న్నా ఐటం భామ‌గా బిజీ అవ్వ‌డానికి అదీ కూడా కార‌ణం. తాజాగా అమ్మ‌డు బాలీవుడ్ లో నూ ఐటం పాట‌ల‌కి ఒకే చెప్పేసింది. ఏకంగా దెయ్యం ముందే చిందులేయ‌డానికి రెడీ అవుతోంది. ప్ర‌స్తుతం శ్ర‌ద్దాక‌పూర్..రాజ్ కుమార్ రావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో ' స్త్రీ'కి సీక్వెల్ తెర‌కెక్కుతోంది. అమ‌ర్ కౌశిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రంలో మిల్కీబ్యూటీని ఐటం భామ‌గా ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా కోసం అమర్ ఓ ప్ర‌త్యేక ప్ర‌పంచాన్ని సృష్టించారు.

స్త్రీని మించి మ‌రింత ఎంట‌ర్ టైనింగ్ ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాలంటున్నాయి. దీనిలో భాగంగా ఓ ఐటం పాట కూడా ఉంటే క‌మ‌ర్శియ‌ల్ గా మ‌రింత వ‌ర్కౌట్ అవుతుంద‌ని భావించి త‌మ‌న్నా తో స్పెష‌ల్ సాంగ్ చేయిస్తున్నారుట‌. బాలీవుడ్ లో కొంత మంది భామ‌ల పేర్లు ప‌రిశీల‌న అనంత‌రం త‌మ‌న్నాని ఫైన‌ల్ చేసిన‌ట్లు చిత్ర వ‌ర్గాల నుంచి లీకులందుతున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని సౌత్ లోనూ ప‌క్కా రిలీజ్ అనే స‌మాచారం బ‌లంగా వినిపిస్తుంది.

ఈ సినిమాని పాన్ ఇండియాలో రిలీజ్ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు కొన్ని నెల‌ల క్రితం వెలుగులోకి వచ్చింది. ఇప్ప‌టికే సౌత్ ఆడియ‌న్స్ కి శ్ర‌ద్దా క‌పూర్ సుప‌రిచిమ‌తే. అలాగే శ్రీకాంత్ బొల్లా బ‌యోపిక్ తో రాజ్ కుమార్ రావు తెలుగు ఆడియ‌న్స్ కి మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నాడు. తాజాగా త‌మ‌న్నా ఎంట్రీతో స్త్రీ-2పై మ‌రింత బ‌జ్ క్రియేట్ అవుతుంది. త్వ‌ర‌లోనే ఆమెపై పాట చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని స‌మాచారం. అలాగే ఈ చిత్ర టీజ‌ర్ కూడా రిలీజ్ చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.