Begin typing your search above and press return to search.

టాలెంటెడ్ డైరెక్టర్.. ఆ 100 కోట్ల సినిమా ఏమైంది?

గ్రహణం సినిమాతో అవార్డులను సొంతం చేసుకున్న ఆయన ఆ తర్వాత కమర్షియల్ ఫార్మాట్లో అష్టాచమ్మా జెంటిల్మెన్ లాంటి సినిమాలు చేసి మంచి గుర్తింపును అందుకున్నారు.

By:  Tupaki Desk   |   1 March 2024 7:35 AM GMT
టాలెంటెడ్ డైరెక్టర్.. ఆ 100 కోట్ల సినిమా ఏమైంది?
X

టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ భారీ సక్సెస్ లు చూడకపోయినప్పటికీ కూడా ఓ వర్గం దర్శకులపై మాత్రం ప్రేక్షకులు ఎప్పుడో నమ్మకం కోల్పోలేదు. అలాంటి దర్శకులలో మోహనకృష్ణ ఇంద్రగంటి ఒకరు. ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్ లతో చేసే ప్రయోగాలకు బాక్సాఫీస్ వద్ద చాలా సార్లు మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్రహణం సినిమాతో అవార్డులను సొంతం చేసుకున్న ఆయన ఆ తర్వాత కమర్షియల్ ఫార్మాట్లో అష్టాచమ్మా జెంటిల్మెన్ లాంటి సినిమాలు చేసి మంచి గుర్తింపును అందుకున్నారు.


ఇక చిన్న బడ్జెట్లో ఆమీ తూమీ, సమ్మోహనం లాంటి సినిమాలతో నిర్మాతలకు మంచి లాభాలను అందించారు. ఇక ఆయన ప్రతిసారి స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు చేయాలనే విధంగా అడుగులు వేస్తున్నప్పటికీ అది నాని రేంజ్ వరకు మాత్రమే వెళుతుంది. అంతకుమించిన స్టార్ తో ఇప్పటివరకు మోహనకృష్ణ అవకాశం అందుకోలేకపోయారు.

ఇక ఆయన నుంచి ఇటీవల వచ్చిన ఒక సినిమాలు మాత్రం ఒక్కసారిగా క్రేజ్ ను తగ్గించేసాయి. అందులో నానితో చేసిన V సినిమా ఒకటి. అలాగే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా కూడా దారుణంగా డిజాస్టర్ అయింది. ఇక ఆ రిజల్ట్ తో సంబంధం లేకుండానే ఆయన దిల్ రాజుతో కొంతకాలం పాటు ట్రావెల్ చేశారు. 100 కోట్ల బడ్జెట్ తో ఒక అడ్వెంచర్ ఫాంటసీ కథను తెరపైకి తీసుకురావాలని అనుకున్నారు.

దానికి జటాయు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక హీరో ఎవరు అనే విషయంలో చాలా రకాల గాసిప్స్ వచ్చాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ పేరు ఫిక్స్ అయిందని కూడా ఉన్నారు. మళ్లీ ఏమైందో ఏమో ఆ ప్రాజెక్టు గురించి ఎవరు పెద్దగా మాట్లాడలేదు. ఇక ఇప్పుడు మోహనకృష్ణ మళ్ళీ చిన్న బడ్జెట్ లోనే ప్రియదర్శితో ఒక సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రియదర్శి కూడా డిఫరెంట్ కథలు చేస్తూ హీరోగా మంచి క్రేజ్ అందుకుంటున్నడు. బలగం తర్వాత అతనికి మంచి డిమాండ్ పెరిగింది. ఇక ఇప్పుడు ఇంద్రగంటి లాంటి దర్శకుడి తో సినిమా చేస్తున్నాడు అంటే తప్పకుండా కంటెంట్ కొత్తగా ఉంటుంది అని ఆడియన్స్ లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఇక ఈ సినిమాను జెంటిల్మెన్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించబోతున్నారు.