Begin typing your search above and press return to search.

5 పదుల వయసు దాటినా అబ్బా అనిపించే అందం

తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోవడమే ఇప్పుడు చాలా పెద్ద టాస్క్‌

By:  Tupaki Desk   |   4 Jan 2024 2:30 PM GMT
5 పదుల వయసు దాటినా అబ్బా అనిపించే అందం
X

తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోవడమే ఇప్పుడు చాలా పెద్ద టాస్క్‌. అలాంటిది ఒక తెలుగు అమ్మాయి స్టార్‌ హీరోలకు జోడీగా హీరోయిన్‌ గా నటించి, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లో అడుగు పెట్టి, అక్కడ కూడా స్టార్‌ గా వెలుగు వెలిగింది. ఆమె ఎవరో కాదు సీనియర్‌ హీరోయిన్‌ టబు.


అయిదు పదుల వయసు దాటినా కూడా ఇంకా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న టబు, పాతికేళ్ల క్రితం ఎంత అందంగా అయితే ఉందో ఇప్పుడు కూడా అంతే అందంగా చూడగానే అబ్బా అనిపించేంత అందంగా ఉంది అంటూ తాజా ఫోటోలను చూస్తే అనిపిస్తోంది.


సోషల్ మీడియాలో రెగ్యులర్‌ గా టబు అందమైన ఫోటోలు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ఎప్పటిలాగే టబు అందాల ఫోటోలు కన్నుల విందు చేస్తున్నాయి. 52 ఏళ్ల వయసులో ఇంత అందంగా ఉండటం కేవలం టబు కి మాత్రమే చెల్లింది అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుత హీరోయిన్స్‌ మూడు పదుల వయసులో లేదా నాలుగు పదుల వయసులోనే కనిపించకుండా పోతున్నారు. చాలా మంది బొద్దుగా, అందం కోల్పోయి కనిపిస్తూ ఉన్నారు. అలాంటిది 52 ఏళ్ల వయసు టబు ఇంకా పాతికేళ్ల పడుచు అమ్మాయిలతో సమానమైన అందం ను కలిగి ఉందని ఈ ఫోటోలు చూస్తే అనిపిస్తోంది కదా..!