Begin typing your search above and press return to search.

50 ఏళ్ల వ‌య‌సులో 'ట‌బు' ఆలా చేసిందా !

విశాల్ భ‌ర‌ద్వాజ్ 'ఖుపియా' అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌కి ట‌బుని తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   15 Sep 2023 6:20 AM GMT
50 ఏళ్ల వ‌య‌సులో ట‌బు ఆలా చేసిందా !
X

రెండేళ్ల‌గా సీనియ‌ర్ బ్యూటీ ట‌బు కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. 50 ఏళ్ల వ‌య‌సులోనూ ట‌బు స‌త్తా చాటుతుంది. స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కొన‌సాగుతూనే హాట్ పాత్ర‌ల్లోనూ న‌టిస్తోంది. 50 ఏళ్ల వ‌య‌సులోనూ ట‌బు రొమాంటిక్ ఇమేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తుంది. కుర్ర హీరోల‌తో ఘాటైన రొమాంటిక్ స‌న్నివేశాల్లో త‌న‌దైన మార్క్ వేస్తోంది. పాత్ర‌ని బ‌ట్టి ట‌బు త‌న‌ని తాను ఎలాగైనా మౌల్డ్ చేసుకుంటుంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా ట‌బు ఓ సాహ‌సోపేత‌మైన పాత్ర‌కి రెడీ అవుతోంది. 'ఎస్కేప్ టూ నోవేర్' అనే న‌వ‌ల ఆధారంగా విశాల్ భ‌ర‌ద్వాజ్ 'ఖుపియా' అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌కి ట‌బుని తీసుకున్నారు. ఓ క్లిష్ట‌మైన మిష‌న్ ని చేప‌ట్టిన ఆర్ అండ్ ఏడ‌బ్ల్యూ ఆప‌రేటివ్ కృష్ణ మెఓహ‌రా చుట్టూ తిరిగే క‌థ ఇది. ఇందులో ట‌బు ఓ స్పైగా..ప్రేమికురాలిగా నిపించ‌నుంది.

స్పై గా ఆమె పాత్ర ఛేజింగ్ లు..ఎస్కేప్లు...సాహ‌సోపేతంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ర‌హ‌స్యాన్ని చేధించేందుకు స్పై గా ఎలాంటి సాహ‌సాలు చేసింది? అందుకోసం ఆమె ఎంత‌గా శ్ర‌మించారు? అదే స్పై రొమాంటిక్ మోడ్ లో ఎలా ఉంటుందో? కూడా తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. పాత్ర ప‌రంగా కొన్ని స‌న్నివేశాల‌కు వ‌య‌సు స‌హ‌క‌రించ న‌ప్ప‌టికీ ట‌బు మొక్క‌వోని దీక్ష‌తో ఆ పాత్ర‌ని ప‌రిపూర్ణం చేసిన‌ట్లు తెలుస్తోంది.

అలీఫ‌జ‌ల్..వామికా గ‌బ్బి.. అశిష్ విద్యార్ధి లాంటి న‌టులు ఇత‌ర కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాతో ట‌బుకి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కుతుంద‌ని యూనిట్ చెబుతుంది. పాత్ర కోసం తాను ప‌డిన క‌ష్టం తెర‌పై క‌నిపిస్తుంద‌ని..ప్ర‌తీ స‌న్నివేశం ఆమెకి స‌వాల్ గానే ఉంటుంద‌ని...అందుకోసం ఆమె ప్ర‌త్యేకంగా హోమ్ వ‌ర్క్ చేసి సిద్ద‌మైన‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. ఈ సినిమా నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పాటు ట‌బు ఇంకా మూడు హిందీ సినిమాలు చేస్తోంది. అలాగే కొన్ని కొత్త ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసిన‌ట్లు స‌మాచారం. రెండు..మూడేళ్ల‌గా ట‌బు ఖాతాలో సినిమాలు ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి.