అఖిల్ పెళ్లిలో టబు స్పెషల్ గురూ!
కానీ ముంబై నుంచి దిగిన టబు మాత్రం సంథింగ్ స్పెషల్ గా హైలైట్ అయ్యారు.
By: Tupaki Desk | 11 Jun 2025 11:59 AM ISTఆహ్వానించిన అతిధులంతా విచ్చేస్తే ఆహ్వానితులు అంటే ఎంతో సంతోషంగా భావిస్తారు. ప్రేమ, అభిమా నం, గౌరవానికి చిహ్నంగా వాళ్లను భావిస్తాం. అందులోనూ ప్రత్యేక ఆహ్వానితులు..ముఖ్య ఆహ్వానితులు వస్తే ఇంకా సంతోషం. ఇటీవలే అక్కినేని అఖిల్-జైనబ్ రవ్జీల వివాహం, రిసెప్షన్ కార్యక్రమాలు నాగార్జున ఇంట్లో నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని కుటుంబానికి బాగా కావాల్సిన అతిధుల్ని మాత్రమే ఆహ్వానించారు.
ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, కొంత మంది ముఖ్యమైన రాజకీయ ప్రముఖులు మాత్రమే పాల్గొన్నారు. వీళ్లందరిలో ఎంతో మంది గొప్ప సెలబ్రిటీలు ..పారిశ్రామిక వేత్తులు కూడా ఉన్నారు. కొంత మంది నటీమణులు..హీరోయిన్లు కూడా ఉన్నారు. కానీ ముంబై నుంచి దిగిన టబు మాత్రం సంథింగ్ స్పెషల్ గా హైలైట్ అయ్యారు. ఎంత మంది అతిధు లొచ్చినా? చర్చకు రాలేదు కానీ ముంబై నుంచి టబు ప్రత్యేకంగా అక్కినేని ఇంట వివాహానికి రావడం అభిమానులకే కాదు ప్రేక్షకులకు కన్నుల విందుగా అనిపించింది.
అక్కినేని కుటుంబంతో ఆమెకు అనుబంధం ఈ రూపేణా మరోసారి బయట పడింది. టబు నవదంతులతో దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. నలుపువర్ణం చీరలో ఎంతో అందంగా ముస్తాబై వేడుకకు హాజర య్యారు. ముంబై నుంచి టబు రాడానికి ఓ ప్రత్యేక కారణంగా ఉంది. అక్కినేని కుటుంబంతో టబు అను బంధం ఈనాటిది కాదు. నాగార్జున-టబు జంటగా కొన్ని సినిమాలు కూడా చేసారు.
అలా మొదలైన పరిచయం ఇద్దరి మధ్య మంచి స్నేహాన్ని బలపరించింది. అప్పటి నుంచి టబు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా? నాగార్జున ఇంట్లోనే ల్యాండ్ అవుతారు. నాగార్జున కంటే ముందే అక్కినేని అమల కు టబు మంచి స్నేహితురాలు. టబు 16 ఏళ్ల వయసు నుంచే అమలకు స్నేహితురాలు. నాగార్జున ఇంటి ముందున్న ప్లాట్ కూడా అమల- టబు కోసమే కట్టించిందంటారు. టబు కూడా హైదరాబాద్ లో పుట్టి పెరిగిని వారే.