పూరీ మూవీ ఫైనల్ స్టార్ కాస్ట్ ఇదీ!
ఈ మూవీ కోసం డిఫరెంట్ స్టార్ కాస్ట్‌ని పూరీ తాజాగా ఫైనల్ చేయడం ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 19 Jun 2025 1:31 PM ISTటాలీవుడ్‌లో వెర్సటైల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ గత కొంత కాలంగా వరుస డిజాస్టర్లని ఎదుర్కొంటున్నారు. 'ఇస్మార్ట్ శంకర్'తో బ్లాక్ బస్టర్ హిట్‌ని దక్కించుకుని అదే ఫామ్‌ని కొనసాగిస్తాడని అంతా ఊహించారు. కానీ అది జరగలేదు. వరుసగా డిజాస్టర్లని సొంతం చేసుకుని పూరీ అభిమానులకు షాక్ ఇచ్చాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో చేసిన 'లైగర్' పాన్ ఇండియా లెవెల్లో డిజాస్టర్‌గా నిలిచి దర్శకుడిగా పూరీకి చేతు అనుభవాన్ని మిగిల్చింది.
ఇక ఆ తరువాత రామ్‌తో మళ్లీ ఇస్మార్ట్ స్టైల్‌లో హిట్టు కొట్టాలని చేసిన ప్రయత్రం 'డబుల్ ఇస్మార్ట్' కూడా బెడిసికొట్టింది. దీంతో ఆలోచనలో పడిన పూరీ ఈ సారి కంగారు పడకుండా కూల్‌గా వెళ్లి బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకుని మళ్లీ ట్రాక్‌లోకి రావాలని పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నాడు. త్వరలో పూరీ తమిళ క్రేజీ నటుడు విజయ్ సేతుపతి హీరోగా ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. ఓ బిచ్చగాడి కథగా విభిన్నమైన పాయింట్‌తో తెరపైకి రాబోతోంది.
ఈ మూవీ కోసం డిఫరెంట్ స్టార్ కాస్ట్‌ని పూరీ తాజాగా ఫైనల్ చేయడం ఆసక్తికరంగా మారింది. హీరోగా విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకోవడంతో పూరీ కొత్తగా ఆలోచిస్తున్నాడని, విభిన్నమైన కథతో ప్రేక్షకులని సర్‌ప్రైజ్ చేయబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో మొదలైంది. దాన్ని కంటిన్యూ చేస్తూ మిగతా నటీనటులని ఫైనల్ చేశాడు. ఇప్పటికే ఓ కీలక క్యారెక్టర్ కోసం టబుని తీసుకున్న పూరి అదే పంథాలో కన్నడ నటుడు దునియా విజయ్‌ని రంగంలోకి దించేశాడు.
తాజాగా మరో అడుగు ముందుకేసి హీరోయిన్‌గా గోల్డెన్ లెగ్ హీరోయిన్ సంయుక్త మీనన్‌ని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చాడు. ఫైనల్‌గా క్రేజీ స్టార్ కాస్ట్ ఈ సినిమాకు ఫైనల్ అయిపోయింది. ఇక రోల్ కెమెరా, యాక్షన్ చెప్పడమే తరువాయి. ప్రధాన కాస్టింగ్‌ని ఫైనల్ చేసిన పూరీ త్వరలోనే ఈ క్రేజీ మూవీని పట్టాలెక్కించబోతున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వీంగ్‌లో జరుగుతోంది.
