Begin typing your search above and press return to search.

పూరి కోసం సీనియ‌ర్ హాట్ సెరైన్!

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ప్రాజెక్ట్ లాక్ అయిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 April 2025 4:16 PM IST
పూరి కోసం సీనియ‌ర్ హాట్ సెరైన్!
X

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ప్రాజెక్ట్ లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఓడిఫ‌రెంట్ స్టోరీతో సేతుపతిని పూరి లాక్ చేసాడు. ప్ర‌స్తుతం పూరి ఈ ప్రాజెక్ట్ ప‌నుల్లోనే బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ కి సంబంధించి తుది ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యాడు. అలాగే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో హీరోయిన్ గా ఎవ‌రు ఎంపిక‌వుతారు? పూరి విల‌న్ ఎవ‌రు? అన్న‌ది తేలాలి.

అయితే సినిమాలో ఓ కీల‌క పాత్ర‌కు సీనియ‌ర్ హాట్ సెరైన్ ట‌బును సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే పూరి ముంబై వెళ్లితో ఆమె చ‌ర్చించిన‌ట్లు...ట‌బు కూడా పాజిటివ్ గా స్పందించిన‌ట్లు వార్త లొస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ పూరి సినిమాల్లో ట‌బు న‌టించ‌లేదు. గ‌తంలో చాలా మంది సీనియ‌ర్ న‌టీమ‌ణులు పూరి సినిమాల్లో న‌టించారు. కొంత మంది పూరి సినిమాల‌తో కంబ్యాక్ అయిన వారు ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో పూరి రాసిన పాత్ర ట‌బుని డిమాండ్ చేయ‌డంతో ఆఫ‌ర్ ఆమె వ‌ర‌కూ వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ట‌బు `అల‌వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో టాలీవుడ్ లో మ‌ళ్లీ కంబ్యాక్ అయిన సంగ‌తి తెలిసిందే. మంచి విజ‌యంతోనే కంబ్యాక్ అయింది. కానీ ఆ త‌ర్వాత ట‌బు మ‌ళ్లీ కొత్త సినిమాలు చేయ‌లేదు. బాలీవుడ్ లోనే ప‌ని చేస్తోంది త‌ప్ప టాలీవుడ్ లో కంటున్యూ అవ్వ‌లేదు. మ‌రి అవ‌కాశాలు రాక న‌టించ‌లేదా? పాత్ర‌ల న‌చ్చ‌క క‌మిట్ అవ్వ‌లేదా? అన్న‌ది క్లారిటీ లేదు.

ఈ నేప‌థ్యంలో పూరి ఛాన్స్ పై పాజిటివ్ గా స్పందించ‌డం ఇంట్రెస్టింగ్. ప్ర‌త్యేకించి పూరి ప‌నిగట్టుకుని ట‌బుని తీసుకొస్తున్నాడంటే? ఆమె పాత్ర సినిమాలో శ‌క్తివంత‌మైన‌దే అవుతుంది. కొన్ని లీడ్ రోల్స్ ని పూరి చాలా బ‌లంగా రాస్తాడు. ముఖ్యంగా హీరోల మామ్ పాత్ర‌ల‌కు ప‌వ‌ర్ పుల్ గా ఉంటాయి. జ‌య‌సుధ‌, రేవ‌తి, ర‌మ్య‌కృష్ణ లాంటి న‌టుల‌కు పూరి సినిమాలు సెకెండ్ ఇన్నింగ్స్ లో మంచి గుర్తింపును తెచ్చిన‌వే. ఈ నేప‌థ్యంలో ట‌బు పాత్ర కూడా మ‌క్క‌ల్ సెల్వ‌న్ సినిమాలో అంతే కీల‌కంగా ఉంటుంది.