Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : ఈ అందం వయసు లెక్కించడం అసాధ్యం

సీనియర్‌ హీరోయిన్‌ టబు అయిదు పదుల వయసులో పడి మూడు ఏళ్లు అవుతుంది. అయినా కూడా టబు ఫోటో షూట్స్‌ లో మూడు పదుల వయసు హీరోయిన్‌ మాదిరిగానే ఉంటుంది.

By:  Tupaki Desk   |   28 July 2025 6:03 PM IST
పిక్‌టాక్‌ : ఈ అందం వయసు లెక్కించడం అసాధ్యం
X

ఒకప్పుడు హీరోయిన్స్‌ మూడు పదుల వయసు దాటిన తర్వాత పెద్దగా కనిపించే వారు కాదు, నాలుగు పదుల వయసులో ఆంటీ పాత్రలు, అయిదు పదుల వయసులో అమ్మమ్మ పాత్రలు పోషించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఈతరం హీరోయిన్స్‌ అలా కాదు. ప్రస్తుతం ఉన్న సీనియర్‌ స్టార్స్ హీరోయిన్స్‌ లో చాలా మంది అయిదు పదుల వయసులో ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో బిజీగా హీరోయిన్‌ వేశాలు వేస్తున్నారు. హీరోయిన్‌ కాకున్నా కనీసం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అయినా మంచి ఆఫర్లు దక్కించుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో చాలా మంది సీనియర్‌ హీరోయిన్స్‌ అందం గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా టబు పేరు ఉంటుంది అనడంలో సందేహం లేదు.


సీనియర్‌ హీరోయిన్‌ టబు అయిదు పదుల వయసులో పడి మూడు ఏళ్లు అవుతుంది. అయినా కూడా టబు ఫోటో షూట్స్‌ లో మూడు పదుల వయసు హీరోయిన్‌ మాదిరిగానే ఉంటుంది. ఈమె అందం ఏమాత్రం తగ్గడం లేదు అంటూ ప్రతి ఫోటోకు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తూ ఉంటారు. టబు గురించి పెద్దగా తెలియని వారు, ఆమె పాత సినిమాలు చూడని వారిని ఆమె ఫోటోలు చూపించి వయసు ఎంత అంటే ఠక్కున చెప్పడం కష్టమే. ఎక్కువ శాతం మంది ముప్పై నుంచి నలబై మధ్య వయసు ఉంటుందేమో అని అంటారు. ఎక్కువ శాతం మంది మూడు పదుల వయసు లోపు ఉండే అవకాశం ఉందని అంటారు. అంతే కానీ ఈమె అయిదు పదుల వయసు అని ఏ ఒక్కరూ ఖచ్చితంగా అనరు అనడంలో సందేహం లేదు.


తాజాగా మరోసారి టబు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన చీర కట్టు ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. టబు ఎంత అందంగా ఉంటుందో ఈ ఫోటోలు మరోసారి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తాయి అనడంలో సందేహం లేదు. అందమైన రూపంకు తగ్గట్లుగా అంతకు మించిన అందమైన చీర కట్టులో టబు మరింత అందంగా ఉందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. టబు ఇంత అందంగా ఉండటం వల్లే ఇప్పటికీ హీరోయిన్స్‌ ఆఫర్లు వస్తున్నాయి. సీనియర్‌ హీరోలతో పోల్చితే ఈమె చాలా వయసులో చిన్న అన్నట్లుగా ఉంటుంది. హీరోలు ఐదు.. ఆరు పదుల వయసులోనూ టబుతో హీరోయిన్‌గా నటించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. చాలా మంది సీనియర్‌ హీరోలతో ఈమె నటించింది.


తాజా ఫోటోల్లో టబు అందమైన చిరు నవ్వు నెటిజన్స్‌ను అలాగే కట్టిపడేసి ఉంచుతుంది. చీర కట్టులో టబును గతంలో చాలా సార్లు చూశాం. కానీ ఈసారి అంతకు మించి అందం అన్నట్లుగా ఉంది అనడంలో సందేహం లేదు. ఆకట్టుకునే రూపంతో పాటు, మంచి చిరునవ్వు టబు సొంతం. అందుకే గత మూడు దశాబ్దాలుగా ఆమెను ప్రేక్షకులు అభిమానిస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అభిమానించే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ అందమైన టబు మరిన్ని మంచి సినిమాలు చేయాలని, ఆకట్టుకునే విధంగా పాత్రలను ఎంపిక చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. టబు గతంలో ఎన్నో సార్లు ప్రేమలో పడిందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు టబు వైవాహిక జీవితంలో అడుగు పెట్టలేదనే విషయం తెల్సిందే.