Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : ఈమె ఏజ్‌ 53 అంటే మీరు నమ్ముతారా..?

ఇండియన్‌ సిల్వర్ స్క్రీన్‌పై ఆరు పదుల వయసు దాటిన హీరోలు ఉన్నారు కానీ హీరోయిన్స్ మాత్రం తక్కువ వయసుకే కనుమరుగు అవుతారు.

By:  Tupaki Desk   |   28 Jun 2025 10:00 PM IST
పిక్‌టాక్‌ : ఈమె ఏజ్‌ 53 అంటే మీరు నమ్ముతారా..?
X

ఇండియన్‌ సిల్వర్ స్క్రీన్‌పై ఆరు పదుల వయసు దాటిన హీరోలు ఉన్నారు కానీ హీరోయిన్స్ మాత్రం తక్కువ వయసుకే కనుమరుగు అవుతారు. హీరోయిన్‌ అంటే రెండు పదుల వయసు నుంచి మూడు పదుల వయసు మధ్యలో ఉండాలి అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న హీరోయిన్స్‌లో కొంతమంది ఆ భావన తొలగించారు. అయిదు పదుల వయసు దాటినా మూడు పదుల వయసు అందంతో కవ్విస్తున్నారు. అందుకే అయిదు పదుల వయసులో కూడా హీరోయిన్‌గా నటించడం ద్వారా సర్‌ప్రైజ్ చేస్తున్నారు. అయిదు పదుల వయసు దాటినా కూడా హీరోయిన్‌గా నటించే ముద్దుగుమ్మల్లో టబు ముందు ఉంటారు. ఈమె ఇప్పటికీ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది.


తెలుగులో కూలీ నెం.1 సినిమాలో హీరోయిన్‌గా నటించడం ద్వారా అందరికి పరిచయం అయిన టబు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఈమె జర్నీ మొదలైంది. ఒకానొక సమయంలో ఈమె సౌత్‌ ఇండియన్ సినిమాలకు పూర్తిగా దూరం అయింది. తెలుగు సినిమా ఆఫర్లు వచ్చినా కూడా ఎక్కువగా హిందీ సినిమాలు చేసింది. హిందీలో దాదాపు అందరు స్టార్‌ హీరోలకు జోడీగా నటించింది. ఈ జనరేషన్‌ హీరోలతో కాకుండా 1990,2000 హీరోలతో ఈమె నటించింది. ఇప్పటికీ సినిమాలు చేస్తున్న ఈమె సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేసింది.


ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు మిలియన్‌ల కంటే ఎక్కువ మందిని తన ఫాలోవర్స్‌గా చేర్చుకున్న టబు రెగ్యులర్‌గా ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. అయిదు పదుల వయసులో చేరి మూడు ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ ఈమె మూడు పదుల వయసు అందగత్తె అన్నట్లుగానే ఉంటుంది. ఈమె రెగ్యులర్‌గా షేర్‌ చేసే ఫోటోలను చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఈమె ఈ వయసులో కూడా ఇంత అందంగా ఎలా ఉంది అంటూ చాలా మంది కామెంట్‌ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోని ఈమె ఫ్యామిలీ లైఫ్‌ ను మిస్ అవుతుంది కదా పాపం అంటూ అభిమానులు అంటూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఈమె ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ ఉంటాయి.


తాజాగా చీర కట్టు ఫోటోలను షేర్‌ చేసిన టబు అందరి దృష్టిని తన వైపుకు ఆర్షించింది. నల్ల చీర కట్టి సింపుల్‌ హెయిర్‌ స్టైల్‌తో, అదిరిపోయే మేకోవర్‌తో టబు చూపు తిప్పుకోనివ్వడం లేదు. అయిదు పదుల వయసులోనూ కుర్రకారు చూపు తనపై పడేలా చేసుకుంటుంది అంటే టబు ఎంతటి అందగత్తో అర్థం చేసుకోవచ్చు. సోషల్‌ మీడియాలో టబు చీర కట్టు ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ ఉంటాయి. అయితే ఈసారి బ్లాక్‌ కలర్‌ సారీ లో మరింత అందంగా ఉంది అంటూ అభిమానులు, ఇన్‌స్టాఫాలోవర్స్‌, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఈమె హౌస్‌ఫుల్‌ 5 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే బహూత్ బంగ్లా అనే సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.