మ్యూజిక్ నుంచి మెమొరీస్ వరకు..
అందులో భాగంగానే డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్ ను కూడా నాట్స్ సత్కరించింది.
By: Tupaki Desk | 7 July 2025 11:38 AM ISTతబిత సుకుమార్ అంటే మొదట్లో అందరికీ సుకుమార్ భార్యగానే తెలుసు. కానీ గత కొంత కాలంగా తబిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తబిత నిర్మాతగా మారి మారుతి నగర్ సుబ్రమణ్యం అనే సినిమాను కూడా నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో వహించిన ఆ సినిమాలో రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించగా, ఆ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. దీంతో పాటూ పలు సినిమాలకు తబిత సమర్పకురాలిగా ఉన్నారు.
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ అమెరికా తెలుగు సంబరాలు, టంపా కన్వెన్షన్ సెంటర్ లో ఎంతో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సంబరాలకు టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరవగా, వారిలో పలువురిని నాట్స్ సత్కరించింది. అందులో భాగంగానే డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్ ను కూడా నాట్స్ సత్కరించింది.
నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తూ ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్కరితో తబిత మంచి రిలేషన్ ను మెయిన్‌టెయిన్ చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే తబిత ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే తబిత తాను నాట్స్ కు వెళ్లిన విషయాన్ని వెల్లడిస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
ఆ ఫోటోలకు మ్యూజిక్ నుంచి మెమొరీస్ వరకు.. నిన్న రాత్రి నాట్స్ టంపాలో ఫ్యామిలీ పిక్చర్ తో చాలా అద్భుతంగా ముగిసిందని కొటేషన్ ను కూడా రాసుకొచ్చారు. ఈ ఫోటోల్లో తబితతో పాటూ తన భర్త సుకుమార్, కూతురు సుకృతితో పాటూ కొడుకు సుక్రాంత్ కూడా ఉన్నారు. తబిత షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
