Begin typing your search above and press return to search.

కొత్త సినిమా రిలీజ్ కు ముందు ఆమిర్ సూప‌ర్ స్ట్రాట‌జీ

తారే జ‌మీన్ ప‌ర్ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ లు చాలా కాలం నుంచి రిలీజ్ చేయ‌లేద‌ని, తాను కొత్త‌గా మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానెల్ ఆమిర్ ఖాన్ టాకీస్ లో ఈ సినిమాను అప్‌లోడ్ చేయ‌నున్నామ‌ని తెలిపాడు

By:  Tupaki Desk   |   4 Jun 2025 8:33 PM IST
కొత్త సినిమా రిలీజ్ కు ముందు ఆమిర్ సూప‌ర్ స్ట్రాట‌జీ
X

ఆమిర్ ఖాన్ న‌టించిన తారే జ‌మీన్ ప‌ర్ సినిమా ఎంత పెద్ద హిట్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2007లో రిలీజైన ఈ సినిమా ఏ ఓటీటీలోనూ అందుబాటులో లేదు. ఇప్పుడు ఈ సినిమాను యూ ట్యూబ్ లో ఫ్రీ గా స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. ఈ విష‌యాన్ని రీసెంట్ గా స్టార్ హీరో ఆమిర్ ఖానే వెల్ల‌డించాడు. ఇటీవ‌ల జ‌రిగిన ఫ్యాన్స్ మీట్ లో ఆమిర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు.

తారే జ‌మీన్ ప‌ర్ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ లు చాలా కాలం నుంచి రిలీజ్ చేయ‌లేద‌ని, తాను కొత్త‌గా మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానెల్ ఆమిర్ ఖాన్ టాకీస్ లో ఈ సినిమాను అప్‌లోడ్ చేయ‌నున్నామ‌ని తెలిపాడు. అయితే తారే జ‌మీన్ ప‌ర్ సినిమా యూ ట్యూబ్ లో ఒకటి, రెండు వారాల వ‌ర‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంద‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం ఆమిర్ ఖాన్ చాలా గ్యాప్ త‌ర్వాత సితారే జమీన్ ప‌ర్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. జూన్ 20న సితారే జ‌మీన్ ప‌ర్ రిలీజ్ కానుంది. స‌రిగ్గా ఈ సినిమా రిలీజ్ కు ముందు తారే జ‌మీన్ ప‌ర్ ను యూ ట్యూబ్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ చేయ‌డం మంచి ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీనే. ఈ సంద‌ర్భంగా ఆమిర్ ఖాన్, ద‌ర్షీల్ స‌ఫారీతో ప‌ని చేసిన అనుభ‌వాన్ని గుర్తు చేసుకున్నాడు.

ద‌ర్షీల్ చిన్న వాడైన‌ప్ప‌టికీ ఎంతో స‌హ‌జంగా న‌టించాడ‌ని, చెప్పిన ప్ర‌తీ అంశాన్ని ఎంతో ఈజీగా గ్ర‌హించేవాడని అన్నాడు. సితారే జ‌మీన్ ప‌ర్, తారే జ‌మీన్ ప‌ర్ సినిమాకు పూర్తి భిన్నంగా ఉంటుంది. స్పోర్ట్స్ కామెడీ డ్రామాగా రూపొందిన సితారే జ‌మీన్ ప‌ర్ లో జెనీలియా, డాలీ అహ్లువాలియా న‌టించారు. అయితే తారే జ‌మీన్ ప‌ర్ సినిమాను ఆడియ‌న్స్ ఇష్ట‌ప‌డ‌టానికి ప‌లు కార‌ణాలున్నాయి.

అందులో ఉన్న మంచి స్క్రీన్ ప్లే, మెసేజ్ ఆడియ‌న్స్ కు విప‌రీతంగా న‌చ్చాయి. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వ‌స్తున్న సితారే జ‌మీన్ ప‌ర్ క‌థ దానికి పూర్తి భిన్నంగా ఉండ‌టం వ‌ల్ల ఈ సినిమా మునుప‌టి సినిమాలా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌ర్క‌వుట్ అవుతుందా లేదా అని ఆడియ‌న్స్ అనుమాన ప‌డుతున్నారు. లాల్ సింగ్ చ‌ద్దా సినిమాతో డిజాస్ట‌ర్ అందుకున్న ఆమిర్ ఖాన్ ఎలాగైనా సితారే జ‌మీన్ ప‌ర్ సినిమాతో మంచి హిట్ అందుకోవాల‌ని ఈ సినిమాను సాయ శ‌క్తులా ప్ర‌మోట్ చేస్తున్నాడు. కానీ హిట్ కావాలంటే కేవ‌లం ప్ర‌మోష‌న్స్ స‌రిపోవు. సినిమాలో కంటెంట్ కూడా ఉండాలి. మ‌రి సితారే జ‌మీన్ ప‌ర్ ఆమిర్ కు ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి.