Begin typing your search above and press return to search.

తాప్సీ తో స్టార్ హీరో ప‌ర్స‌న‌ల్స్!

'డంకీ'తో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ స‌ర‌స‌న న‌టించిన ఛాన్స్ తాప్సీ అందుకున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   31 Dec 2023 12:30 PM GMT
తాప్సీ తో స్టార్ హీరో ప‌ర్స‌న‌ల్స్!
X

'డంకీ'తో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ స‌ర‌స‌న న‌టించిన ఛాన్స్ తాప్సీ అందుకున్న సంగ‌తి తెలిసిందే. అభిమాన న‌టుడి స‌ర‌స‌న న‌టించాల‌ని ఎప్ప‌టి నుంచో క‌ల‌లు కంటోంది. ఆ క‌ల డంకీతో నెర‌వేరింది. కానీ ఫ‌లిత‌మే మిశ్ర‌మ‌గా క‌నిపించింది. 'జ‌వాన్'..'ప‌ఠాన్' రేంజ్ హిట్ ని డంకీ అందుకోక‌పోవ‌డంతో కొంత‌వ ర‌కూ నిరుత్సాహ ప‌రిచే విష‌యం. ఆ ర‌కంగా తాప్సీకి మ‌రోసారి చుక్కెదురైన‌ట్లే క‌నిపిస్తుంది.

ఎందుకంటే ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకుని ఎదురుచూసింది. కెరీర్ లో స‌రైన హిట్ లేదు. డంకీతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల స‌ర‌స‌న క‌నిపించాల‌ని ఎంతో ఆశ‌ప‌డింది. కానీ మ‌రోసారి నిరాశ త‌ప్ప‌లేదు. కానీ ఈసినిమాతో షారుక్ ఖాన్ త‌న‌కెంత క్లోజ్ అయ్యాడు? అన్న‌ది తాప్సీ తాజాగా రివీల్ చేసింది. ఏ న‌టికి రాని గొప్ప అవ‌కాశం త‌న‌కి షారుక్ ఖాన్ తో వ‌చ్చింద‌ని మురిసిపోయింది.

ఆ వివ‌రాల్లోకి వెళ్తే.. నేను షారుక్ తో న‌టిస్తాన‌ని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమా కోసం ఆయ‌న‌తో రెండేళ్లు ప‌నిచేసాను. ఆ సినిమా ఎన్నో నేర్పింది. షూటింగ్ స‌మ‌యంలో త‌న జీవితంలో జ‌రిగిన ఎన్నో సంఘ‌ట‌న‌ల్ని నాతో పంచుకున్నారు. మంచి న‌టులుగా ఎద‌గాడానికి ఏం చేయాలో చెప్పారు. అలాగే ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితంలో చోటు చేసుకున్న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా నాతో పంచుకున్నారు.

ఇలా నాతో ఆ విష‌యాలు షేర్ చేసుకున్నారు అంటే? న‌న్ను ఆయ‌న ఎంత‌గా న‌మ్ముతున్నారో అర్ద‌మ వుతుంది. నేను ఆ న‌మ్మ‌కాన్ని అంతే నిల‌బెట్టుకోవాలి. బ‌హుశా ఇలాంటి అవ‌కాశం ఏ న‌టికి రాదేమో' అంది. ప్ర‌స్తుతం తాప్సీ 'ఫిర్ అయి హ‌సీన్ దిల్ రుబా'లో న‌టిస్తోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని జ‌య‌ప్ర‌ద్ దేశాయ్ తెర‌కెక్కిస్తున్నారు. ఇది హ‌సీనా దిల్ రుబాకి సీక్వెల్. మొద‌టి భాగం మంచి విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో సీక్వెల్ ని తెర‌పైకి తెస్తున్నారు.