Begin typing your search above and press return to search.

తాప్సీ సాంప్ర‌దాయిని సుద్ద పూస క‌బుర్లు!

యానిమ‌ల్ సినిమాతో స‌మాజం చెడిపోతున్న‌ట్లుగా ఆమె వ్యాఖ్యానించింది. 'యానిమ‌ల్ సినిమాని హాలీవుడ్ సినిమాల‌తో పోల్చుతున్నారు. మీరు 'గాన్ గ‌ర్ల‌'ని ఇష్ట‌ప‌డితే యానిమ‌ల్ ని ఇంత‌గా ఇష్ట‌ప‌డ‌రు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 5:43 AM GMT
తాప్సీ సాంప్ర‌దాయిని సుద్ద పూస క‌బుర్లు!
X

టాలీవుడ్ లో తాప్సీ ఎలాంటి హార్ పెర్పార్మెన్సెస్ ఇచ్చిందో చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ఇక్క‌డ ప‌ని చేసినంత కాలం ద‌ర్శ‌కుల హీరోయిన్ గా ప‌నిచేసింది. స‌రైన అవకాశాలు వ‌చ్చినా స‌క్సెస్ లు రాక‌పోవడంతో నిల‌బ‌డ‌లేక‌పోయింది. అటుపై బాలీవుడ్ లో కొత్త ప్ర‌యాణం మొద‌లు పెట్టి ముందుకె ళ్తుంది. ద‌శాబ్ధ కాలంగా హిందీ ప‌రిశ్ర‌మ‌లో రాణిస్తోంది. నిర్మాత‌గానూ మారి ఇక్క‌డ సంపాదించి ఇక్క‌డే పెట్టాల‌ని ముందుకు సాగుతుంది.

ఇక అమ్మ‌డు బాలీవుడ్ కి వెళ్లిన నాటి నుంచి సౌత్ సినిమాల‌పై కొన్ని ర‌కాల విమ‌ర్శ‌లు కూడా అప్పుడప్పుడు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డి సినిమాల‌పై ఇప్ప‌టికే చాలాసార్లు టంగ్ స్లిప్ అయింది. ప్ర‌తిగా విమ‌ర్శ‌లు కూడ ఎదుర్కుంది. తాజాగా తాప్సీ 'యానిమ‌ల్' పైనా త‌న అభిప్రాయాన్ని చెప్పే క్ర‌మంలో మ‌ళ్లీ నోరు జారిన‌ట్లు తెలుస్తోంది. 'యానిమ‌ల్' లో హింస‌.. కృర‌త్వం..రొమాంటిక్ స‌న్నివేశాల‌పై ఇప్ప‌టికే విమ‌ర్శ‌లున్న సంగ‌తి తెలిసిందే. ఇదే సినిమాపై తాప్సీ కూడా అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లు క‌నిపిస్తుంది.

యానిమ‌ల్ సినిమాతో స‌మాజం చెడిపోతున్న‌ట్లుగా ఆమె వ్యాఖ్యానించింది. 'యానిమ‌ల్ సినిమాని హాలీవుడ్ సినిమాల‌తో పోల్చుతున్నారు. మీరు 'గాన్ గ‌ర్ల‌'ని ఇష్ట‌ప‌డితే యానిమ‌ల్ ని ఇంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. హాలీవుడ్ సినిమాల‌ను చూసి అక్క‌డ జ‌నాలు వాటిని అనుక‌రించ‌డంలాంటివి చేయ‌రు. కానీ మ‌న దేశంలో అలా కాదు సినిమాలు చూసి ఆ స్టైల్ లో ఉండాల‌ని అనుకరించ‌డం క‌నిపిస్తుంది. సినిమాలు చూసి మ‌హిళ‌ల్ని వెంబ‌డించ‌డం మ‌న‌దేశంలోనే జ‌రుగుతుంది. ఇది నా అభిప్రాయం మాత్ర‌మే.

ఇలాంటి సినిమాలు చేయ‌కూడ‌ద‌ని చెప్పే వారిలో నేను ఒక‌రిగా ఉంటా. కానీ ఎవ‌రి స్వేచ్ఛ వారికుంటుం ది. ఎవ‌రికి న‌చ్చిన క‌థ‌లు..పాత్ర‌లు వారి పోషించ‌వ‌చ్చు. నేను అయితే ఇలాంటి వాటిని ప్రోత్స‌హించ‌ను. అలాంటి అవ‌కాశాలు వ‌చ్చినా చేయ‌ను' అని అంది. దీంతో నెటి జ‌నులు తాప్సీ పై నిప్పులు చెరుగు తున్నారు. సినిమాని సినిమాగా చూడ‌కుండా మ‌రో కోణంలో చూస్తుంది అందుకే యానిమ‌ల్ పై నెగిటివ్ అభిప్రాయంతో ఉంది అంటున్నారు.