Begin typing your search above and press return to search.

వీడియో: పారే న‌దిలో తేలియాడే నావ‌పై తాప్సీ పెళ్లి

అన్నిటికీ మించి విదేశీ అయిన మాథియాస్ బోకి శిక్కు క‌ల్చ‌ర్ లోని అందాన్ని ప‌రిచ‌యం చేసింది. అత‌డి వాల‌కాన్ని కూడా తాప్సీ పూర్తిగా మార్చేసింది

By:  Tupaki Desk   |   3 April 2024 2:34 PM GMT
వీడియో: పారే న‌దిలో తేలియాడే నావ‌పై తాప్సీ పెళ్లి
X

పారే న‌దిలో తేలియాడే వంతెన లాంటి నావ‌పై అంద‌మైన వేదిక సాక్షిగా.. తాప్సీ ప‌న్ను వ‌రుడు మాథియాస్ బౌతో దండ‌లు మార్చుకుంటూ చేసిన సంద‌డి చూస్తుంటే.. వ్వారెవ్వా.. తాప్సీ పెళ్లి వ్వావ్ వ్వావ్! అన‌కుండా ఉండ‌లేం. ఇక్క‌డ విజువ‌ల్ అంత‌గా ర‌చ్చ చేస్తోంది. తాప్సీ ఎంత జోవియ‌ల్ గా ఉంటుందో, ప్రేమించిన‌వాడిని ఎంత‌గా కొంగున క‌ట్టేసుకుంటుందో కూడా ఈ వీడియో చెబుతోంది.

అలా వంతెన మీదుగా వేదిక‌పైకి వ‌చ్చేప్పుడు మంది మార్భ‌లంతో పాటు నేప‌థ్యంలోని సాంగ్ రిథ‌మ్ కి త‌గ్గ‌ట్టుగా అలా అలా డ్యాన్సులు చేసుకుంటూ అంద‌మైన ఆహార్యంతో తాప్సీ వ‌రుడి చెంత‌కు విచ్చేసిన తీరు వారెవ్వా అన‌కుండా ఉండ‌లేం. త‌న చెలికాడి చెంత‌కు విచ్చేసి న‌వ్వులు చిందిస్తూ అత‌డికి అదిరిపోయే హ‌గ్ కూడా ఇచ్చింది.

వ‌ధువు ముస్తాబు అద‌ర‌హో అనే రేంజులో ఉంది. తాప్సీ ఎరుపు రంగు లెహంగాలో దేవ‌క‌న్య‌నే త‌ల‌పించింది. దానికి తోడు తాప్సీ బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని మ‌రింత‌గా అగ్గి రాజేసింది. చుట్టూ బంధుమిత్రుల కోలాహాలం .. ఫోటోగ్రాఫ‌ర్లు వీడియోగ్రాఫ‌ర్ల‌ సంద‌డి న‌డుమ ఈ పెళ్లి ముగ్ధ మ‌నోహ‌రంగా ఎంతో అందంగా జ‌రిగింద‌ని ఈ వీడియో చెబుతోంది.

అన్నిటికీ మించి విదేశీ అయిన మాథియాస్ బోకి శిక్కు క‌ల్చ‌ర్ లోని అందాన్ని ప‌రిచ‌యం చేసింది. అత‌డి వాల‌కాన్ని కూడా తాప్సీ పూర్తిగా మార్చేసింది. వ‌రుడిగా మారిన మాథియాస్ ట్రెడిష‌న‌ల్ డిజైన‌ర్ షేర్వాణీలో స్మార్ట్ గా క‌నిపించాడు. శిక్కుల త‌ర‌హా త‌ల‌పాగాను కూడా చుట్టాడు. తాప్సీ సీక్రెట్ పెళ్లి గురించి ఇప్ప‌టికే మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. తాజాగా ఈ పెళ్లి తాలూకా అంద‌మైన వీడియో రెడిట్ లో షికార్ చేస్తోంది. ఇంత జ‌రిగాక అయినా.. తాప్సీ త‌న పెళ్లి వార్తలను అధికారికంగా ధృవీకరిస్తారా లేదా అనేది చూడాలి. కొన్నేళ్లుగా మాథియాస్ తో ప్రేమ‌లో ఉన్న తాప్సీ ఇప్ప‌టికి పెళ్లాడింది. మాథియాస్ క్రీడాకారుడు. ఇండియాలో కోచ్ గా ప‌ని చేస్తున్నాడు.

https://www.reddit.com/r/BollyBlindsNGossip/comments/1bul5j1/taapse_pannu_wedding_video/?utm_source=share&utm_medium=web3x&utm_name=web3xcss&utm_term=1&utm_content=share_button