Begin typing your search above and press return to search.

అందంతో పాటు మంచి మనసు ఈమె సొంతం

అనాధాశ్రమంలో పిల్లలకు బొమ్మలు, ఇతర వస్తువులు పంపిణీ చేసేందుకు ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి తాప్సి పని చేసింది.

By:  Tupaki Desk   |   10 Feb 2024 6:23 AM GMT
అందంతో పాటు మంచి మనసు ఈమె సొంతం
X

సొట్ట బుగ్గల సుందరి తాప్సి తెలుగు ప్రేక్షకులకు ఝుమ్మంది నాధం సినిమాతో పరిచయం అయ్యింది. మొదటి సినిమా నిరాశ పరిచినా కూడా ఆ తర్వాత పలువురు టాలీవుడ్‌ స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే టైమ్ కలిసి రాకపోవడంతో టాలీవుడ్ లో భారీ విజయాలు దక్కలేదు.

టాలీవుడ్ లో ఒక వైపు సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌ లో ప్రయత్నాలు మొదలు పెట్టింది. అంది వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ ను కూడా ఈ అమ్మడు హిందీ లో సద్వినియోగం చేసుకుని ఘన విజయాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ అమ్మడు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌.

సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేసే ఈ అమ్మడు ఈసారి ఆసక్తికర ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షించింది. అనాధాశ్రమంలో పిల్లలకు బొమ్మలు, ఇతర వస్తువులు పంపిణీ చేసేందుకు ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి తాప్సి పని చేసింది.

ఆ సమయంలో అక్కడి పిల్లలను చూసి చలించి పోయాను అంది. ఇలాంటి స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి వీరి ముఖాల్లో ఆనందం చూస్తే బాగుంటుందని భావిస్తున్నాను అన్నట్లుగా ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా తన ఆనందం పంచుకుంది.

అందమైన రూపం తో పాటు తాప్సికి అందమైన మనసు కూడా ఉందని దీంతో నిరూపితం అయ్యింది అంటూ నెటిజన్స్ పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇలాగే అందరు హీరోయిన్స్ సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తే తప్పకుండా అంతా బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.