Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కి తాప్సి కౌంటర్

నేను తెలుగు సినిమాల్లో నటించిన సందర్భంగా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో చాలా మంది నన్ను విమర్శించారు.

By:  Tupaki Desk   |   1 Aug 2023 12:30 PM GMT
టాలీవుడ్ కి తాప్సి కౌంటర్
X

మంచు మనోజ్ హీరో గా నటించిన ఝుమ్మంది నాదం సినిమా లో హీరోయిన్ గా నటించడంతో తెలుగు ప్రేక్షకుల కు పరిచయం అయిన ముద్దుగుమ్మ తాప్సి. తెలుగు లో ఈ అమ్మడికి స్టార్ హీరో సినిమాల్లో నటించే అవకాశాలు లభించాయి. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి ఏ ఒక్క సినిమా కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చి పెట్టలేకపోయాయి.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ రాకపోవడంతో బాలీవుడ్ లో ప్రయత్నాలు మొదలు పెట్టింది. అక్కడ జీరో నుండి తాప్సి కెరియర్ ఆరంభించింది. అదృష్టం కలిసి రావడంతో అక్కడ వరుసగా సినిమాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ హోదాను సొంతం చేసుకుంది. అదే సమయంలో సౌత్ లో కూడా అవకాశాలు వచ్చినప్పుడు నటిస్తూనే ఉంది.

కొంత మంది హీరోయిన్స్ ఇక్కడ సక్సెస్ దక్కించుకుంటే అక్కడ ఫెయిల్ అవుతారు.. మరి కొందరు హీరోయిన్స్ ఇక్కడ ఫెయిల్ అయితే అక్కడ సక్సెస్ అవుతారు. కొద్దిమంది మాత్రమే ఇక్కడ అక్కడ సక్సెస్ ని సొంతం చేసుకుంటారు. తాప్సి ఇక్కడ సక్సెస్ లను సొంతం చేసుకోలేక పోయింది. కానీ బాలీవుడ్లో మాత్రం స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకుంది. టాలీవుడ్ లో తాప్సి సక్సెస్ దక్కించుకోక పోవడం పట్ల అప్పట్లో విమర్శలు వ్యక్తం అయ్యాయట.

ఆ విషయమై తాప్సి ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ.. నేను తెలుగు సినిమాల్లో నటించిన సందర్భంగా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో చాలా మంది నన్ను విమర్శించారు. నేను దురదృష్టవంతురాలిన అంటూ నిందించారు. సినిమాలు ఆడక పోవడానికి కారణం నేనే అన్నట్లుగా ఆ సమయంలో కొందరు విమర్శలు చేశారు. నిజానికి నేను సినిమా ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ నుండి వచ్చిన దాని ని కాదు.

ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో కెరియర్ ఆరంభం లో సినిమాల ఎంపిక విషయంలో అవగాహన లేకపోవడంతో కొన్ని తప్పిదాలు చేసిన మాట వాస్తవం. ఆ తప్పుల నుండి పాఠాలు నేర్చుకున్నాను. ఆ పాటలు నేర్చుకునే క్రమంలో నేను చాలా మంది విమర్శల కు గురయ్యాను.

కొన్ని సినిమాల్లో నేను పాటల కు, ఒకటి రెండు సన్నివేశాల కు మాత్రమే పరిమితమైన పాత్రల ను చేశాను. అందువల్ల కూడా నన్ను విమర్శించారని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా మాట్లాడుతూనే టాలీవుడ్ కి కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఈమె సినిమాల కు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.