ఇంట్రెస్టింగ్ సీక్వెల్ ను మొదలెట్టిన తాప్సీ
విభిన్న కథలను ఎంచుకుంటూ ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్న తాప్సీ పన్ను నుంచి 2018లో వచ్చిన ముల్క్ సినిమా ఎంత మంచి టాక్ ను తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Tupaki Desk | 19 May 2025 12:04 PM ISTవిభిన్న కథలను ఎంచుకుంటూ ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్న తాప్సీ పన్ను నుంచి 2018లో వచ్చిన ముల్క్ సినిమా ఎంత మంచి టాక్ ను తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోర్టు రూమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో తాప్సీ తో పాటూ రిషి కపూర్ కూడా నటించి ఆ సినిమాను మరింత రక్తి కట్టించి ఆడియన్స్ ను మరింత ఆకట్టుకున్నారు.
ఓ ముస్లిం కుటుంబం ఎదుర్కొనే మతతత్వానికి సంబంధించిన కథగా ముల్క్ తెరకెక్కింది. ముస్లిం కుటుంబానికి చెందిన మురాద్ అలీ మొహమ్మద్ ఉగ్రవాదంలో చిక్కుకున్న తర్వాత కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందడానికి చేసే ప్రయత్నంగా ముల్క్ రూపొందింది. ఈ సినిమాలో తాప్సీ, రిషి కపూర్ తో పాటూ రజత్ కపూర్, మనోజ్ పహ్వా, ప్రతీక్ బబ్బర్, అశుతోష్ రానా, నీనా గుప్తా, ప్రాచీ షా పాండ్యా కూడా నటించారు.
ఇప్పుడు ముల్క్ సినిమాకు సీక్వెల్ గా ముల్క్2 రాబోతుంది. ముల్క్ సినిమాకు దర్శకత్వం వహించిన అనుభవ్ సిన్హానే ఈ సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ముల్క్ సినిమాలానే ఈ సినిమా కూడా ఐడెంటిటీ, విశ్వాసం, పౌర హక్కులకు సంబంధించిన అంశాలను మరోసారి లోతుగా పరిశీలిస్తుందని చిత్ర యూనిట్ హామీ ఇస్తోంది.
బోల్డ్ క్యారెక్టర్లను ఎంచుకుని తన పవర్‌ఫుల్ నటనతో ఎంతో ప్రఖ్యాతి చెందిన తాప్సీ, మరోసారి ముల్క్ 2లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసే అవకాశముందని తెలుస్తోంది. ముల్క2 తో అనుభవ్ సిన్హా మరింత గొప్ప కంటెంట్ ను ఆడియన్స్ కు అందించి, మరో మంచి హిట్ ను ఖాతాలో వేసుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. ప్రస్తుతం తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో ముల్క్2 కూడా ఒకటిగా నిలిచింది.
