Begin typing your search above and press return to search.

డిజైన‌ర్ లుక్కుతో హీట్ పెంచిన‌ తాప్సీ

విదేశీ ప్రియుడు, క్రీడాకారుడు మాథియాస్ బోని పెళ్లాడిన త‌ర్వాత తాప్సీ ఎలా ఉంది? ఎక్క‌డ ఉంది? ఏం చేస్తోంది? అనే సందేహాలు అభిమానుల‌కు అలానే ఉన్నాయి

By:  Tupaki Desk   |   23 April 2025 8:30 AM IST
డిజైన‌ర్ లుక్కుతో హీట్ పెంచిన‌ తాప్సీ
X

విదేశీ ప్రియుడు, క్రీడాకారుడు మాథియాస్ బోని పెళ్లాడిన త‌ర్వాత తాప్సీ ఎలా ఉంది? ఎక్క‌డ ఉంది? ఏం చేస్తోంది? అనే సందేహాలు అభిమానుల‌కు అలానే ఉన్నాయి. అయితే పెళ్ల‌యాక కూడా తాప్సీ ఎంత మాత్రం మార‌లేదు. మునుప‌టిలా ఎన‌ర్జిటిక్ గా జోష్ క‌న‌బ‌రుస్తోంది. ఎప్ప‌టిలానే సినిమాల్లో న‌టిస్తోంది. నిర్మాత‌గా అడుగులు వేస్తోంది. మునుముందు సాధించాల్సింది చాలా ఉంద‌ని బ‌లంగా న‌మ్ముతోంది.

అయితే త‌న స్నేహితురాళ్లు అయిన ల‌క్ష్మీ మంచు, స‌మంత వంటి వారితో నిరంత‌రం ట‌చ్ లో ఉండే తాప్సీ ప‌న్ను వీళ్ల‌తో క‌లిసి ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తుంద‌ని భావిస్తే అది అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది. మ‌రోవైపు తాప్సీ ప‌న్ను సోష‌ల్ మీడియాల్లో నిరంతరం అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. త‌న లేటెస్ట్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి త‌న‌దైన శైలిలో సందేశాలు పంపుతోంది.

తాజాగా థిక్ కాఫీ క‌ల‌ర్ డిజైన‌ర్ దుస్తుల్లో క‌నిపించిన తాప్సీ, ఈ డ్రెస్ క‌ల‌ర్ గురించి థ్రిల్ అయిన‌ట్టే క‌నిపిస్తోంది. దీనికి క‌ల‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ .. జీవితాంతం చూడాల‌నిపించేంత‌గా.. అంటూ క్యాప్ష‌న్ ని జోడించింది. ఈ ప్ర‌త్యేక‌మైన డిజైన‌ర్ లుక్ లో తాప్సీ ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల‌ మేకోవ‌ర్ ప‌రంగాను తాప్సీ బాగా స్లిమ్ అయింది. మునుప‌టి కంటే స్పెష‌ల్ గా వేడిగా క‌నిపిస్తోందని అభిమానులు ఈ లుక్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే...అనుభావ్ సిన్హాతో క‌లిసి త‌న మూడో సినిమాకి ప‌ని చేయ‌నుంది. దీనికి ముందు.. తాప్సీ మరికొన్ని చిత్రాల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉంది. యాక్షన్ థ్రిల్లర్ `గాంధారి`లోను తాప్సీ న‌టిస్తోంది. దీనిలో కిడ్నాప్‌కి గురైన తన కూతురిని కాపాడుకునే త‌ల్లి పాత్ర‌లో తాప్సీ న‌టిస్తోంది. `వో లడ్కీ హై కహాన్` అనే మ‌రో చిత్రంలోను తాప్సీ న‌టించ‌నుంది. ఈ సంవత్సరం చివర్లో ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ఇందులో ప్రతీక్ గాంధీ తో పాటు తాప్సీ కీల‌క పాత్ర‌లో కనిపించనుంది.