Begin typing your search above and press return to search.

ఓ మగాడు ప్రెగ్నెంట్​ అయితే.. ​సొహెల్ మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్​

ఓ మగవాడు గర్భం దాలిస్తే.. ఎలా ఉంటుందో అన్న అంశంతో సినిమాను తెరకెక్కించినట్లు చూపించారు.

By:  Tupaki Desk   |   5 Aug 2023 1:22 PM GMT
ఓ మగాడు ప్రెగ్నెంట్​ అయితే..  ​సొహెల్ మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్​
X

బిగ్‌బాస్ ఫేమ్ సొహెల్ గురించి తెలిసిందే. నటుడిగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చివరిగా అర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు సినిమాతో వచ్చిన ఆయన.. ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ అనే ఓ ప్రయోగాత్మక మూవీతో రాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి.





తాజాగా మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ప్రచార చిత్రాన్ని అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఫన్ అండ్​ ఎమోషన్స్​తో ఆకట్టుకుంటోంది. సరదాగా ఆడుతూ పాడుతూ లైఫ్​ను హ్యాపీగా గడిపే కుర్రాడు... ప్రేమ, పెళ్లి అంతలోనే ఎవరూ ఊహించని ఓ ట్విస్ట్​ను ఎదుర్కొంటాడు. ఓ మగవాడు గర్భం దాలిస్తే.. ఎలా ఉంటుందో అన్న అంశంతో సినిమాను తెరకెక్కించినట్లు చూపించారు.

'నా పేరు గౌతమ్. నాది మంచి క్రేజీ లైఫ్.. ఓ క్రేజీ గర్ల్ ఫ్రెండ్'​ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్​లో... 'ఇది అందరి లైఫ్​లో ఉండేదే బ్రో.. కానీ నా లైఫ్​లో ఓ ట్విస్ట్' అంటూ సొహెల్ అసలు కథలోకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత అతడు ప్రెగ్నెంట్ అవడాన్ని చూపించడం, దాంతో అతడు ఎలాంటి అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనేది ప్రచార చిత్రంలో చూపించారు.

ఇక ప్రచార చిత్రం చివర్లో.. ఎవ్వరూ ఏం అనుకున్నా తన బేబీ కోసం సొహెల్ కష్టపడటం, బాధపడటం వంటి సీన్లు ఎమోషన్​కు గురి చేశాయి. నీకు ఏం కాదు.. నేనున్నాను అంటూ తన కడుపులో ఉన్న బేబీతో చెప్పే డైలగ్.. మనసులను హత్తుకుంది. మొత్తంగా సోహెల్ యాక్టింగ్ చాలా బాగుంది. ఎమోషన్​ సీన్లను బాగానే హ్యాండిల్ చేసినట్లు అర్థమవుతోంది.

దర్శకుడు శ్రీనివాస్.. మొదట్లో నవ్విసూనే ఆ తర్వాత సడెన్​గా ఎమోషనల్ వైపు కథను తీసుకెళ్లేలా సీన్లను ప్రజెంట్ చేయడం బాగుంది. ఈ చిత్రానికి అతడు దర్శకత్వంతో పాటు స్క్రీన్‍ప్లే కూడా అందించారు. సుహాసిని మణిరత్నం, బ్రహ్మాజీ, రజా రవీంద్ర, అలీ, అభిషేక్ రెడ్డి, వైవా హర్ష, స్వప్నిక తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పి రెడ్డి, రవీరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి కలిసి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు.‘ శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్​గా వ్యవహరించగా.. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ అందించారు.