ఆ థియేటర్ లో డబుల్ కాట్ బెడ్లు.. ఎక్కడంటే?
ఇప్పటివరకు మీరు చాలానే సినిమా థియేటర్ల గురించి విని ఉండొచ్చు. కానీ.. ఇప్పుడు చెప్పే థియేటర్ గురించి మాత్రం విని ఉండరు.
By: Tupaki Desk | 26 April 2025 2:00 PM ISTఈ సమాచారం మొత్తం అచ్చంగా మూవీ లవ్వర్స్ కు మాత్రమే. అది కూడా.. థియేటర్ కు వెళ్లి.. పే..ద్ద వెండి తెర మీద కదిలే బొమ్మల్ని చూస్తూ.. తమను తాము మైమరిచిపోయే వారికి మరింత బాగా కనెక్టు అవుతారు. ఇప్పుడెన్ని వసతులు వచ్చినప్పటికి.. నచ్చిన సినిమాను నలుగురి తో కలిసి చూసే అనుభూతి లెక్కే వేరు ఉంటుంది. ఇంట్లోలో పరిమితమై స్క్రీన్ మీద.. ఓటీటీ సినిమాలు ఎన్ని చూసినా.. థియేటర్ కు వెళ్లి.. ఆ చీకట్లో పెద్ద తెర మీద కదిలే బొమ్మలు.. మెరిసే కళ్ల ఆనందం మాటల్లో చెప్పలేనిది.
ఇప్పటి వరకు మీరు చాలానే సినిమా థియేటర్ల గురించి విని ఉండొచ్చు. కానీ.. ఇప్పుడు చెప్పే థియేటర్ గురించి మాత్రం విని ఉండరు. దీని స్పెషాలిటీ ఏమంటే.. డబుల్ కాట్ బెడ్ మీద.. మెత్తటి పరుపు.. ఎంచక్కటి కుషన్లతో ఏర్పాటు ఉంటుంది. స్విట్జర్లాండ్ లోని స్ట్రీటన్ బాక్ లో ఉన్న ఈ థియేటర్ లోకి సినిమా చూసేందుకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. సినిమా చూస్తారా? లేదంటే ఎంచక్కా ఒక కునుకు తీస్తారా? అన్నది మీ ఇష్టం,
కాకుంటే.. విశాలమైన థియేటర లో డబుల్ కాట్ బెడ్లు వేయటం.. అందులో 11 వీఐపీ బెడ్ సీట్లు కూడా ఉన్నాయి. వీటిని బుక్ చేసుకున్న వారికి మెత్తటి దుప్పటితో పాటు.. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్.. పరుపులు.. సైడ్ టేబుళ్లతో పాటు స్నాక్స్.. డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తారు. ఇలాంటి ఎక్స్ పీరియన్స్ ను మన మూవీ లవ్వర్లు ఫీల్ అయ్యేందుకు వీలుగా.. ఎప్పుడు వస్తుందో?
